Begin typing your search above and press return to search.

మళ్లీ మొదలైంది... సమ్మర్ లో ముక్క కొరకడం కష్టమేనా?

ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో కోళ్లకు వైరస్ విషయం టెన్షన్ పెడుతోంది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది

By:  Tupaki Desk   |   11 Feb 2025 9:56 AM GMT
మళ్లీ మొదలైంది... సమ్మర్  లో ముక్క కొరకడం కష్టమేనా?
X

ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో కోళ్లకు వైరస్ విషయం టెన్షన్ పెడుతోంది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మిగిలిన కోళ్లను నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలు ఫ్లూ వ్యాపించిన పౌల్ట్రీ ఫార్మ్ ల కు వస్తున్నాయి. ఫ్లూ నిర్ధారణ అయిన పౌల్ట్రీలో కోళ్లకు మత్తు ఇచ్చి చనిపోయేలా చేస్తున్నాయి.

అనంతరం ఆ కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెడుతున్నారు. ఈ సమయలో పౌల్టీ పరిశ్రమల వద్దకు చేరుకుంటున్న ప్రత్యేక బృందాలు పీపీఈ కిట్లు ధరించి కోళ్లకు ఎనస్తీషియా ఇస్తున్నారు. ఫలితంగా.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అవును... అటు ఏపీతో పాటు తమ ప్రాంతంలోనూ కోళ్లలో వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న వేళ తెలంగాణ పశు సంవర్థక శాఖ అలర్ట్ అయ్యింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ పశు సంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభసాచి గోష్.. ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో భాగంగా.. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా వైరస్ సోకిన కోళ్లను దూరంగా పూడ్చిపెట్టాలని స్పష్టం చేశారు. వాటిని తరలించే విషయంలో కీలక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

మరోపక్క.. ఈ బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ మార్కెట్ లో అమ్మకాలు పడిపోయాయి. చికెన్ రేటు కేజీ 30 రూపాయలకు పైగా తగ్గిపోయిందని అంటున్నారు. మరోపక్క బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్ల సరఫరా నిలిపేసినట్లు చెబుతున్నారు.

కాగా... ఏపీలో వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపారు. వీటిలో తూర్పు గోదావరి జిల్లా పెరవలి, పశ్చిమ గోదావరి జిల్లా వెళ్పూరులోని ఫారాల నుంచి పంపిన శాంపుల్స్ ఏవియన్ ఇన్ ఫ్లుయేంజా (హెచ్5ఎన్1 - బర్డ్ ఫ్లూ) పాజిటివ్ గా గుర్తించారు.