Begin typing your search above and press return to search.

బాబు మార్క్ జిల్లా టూర్లు ఉంటాయా ?

ఈ ట్రెండ్ క్రియేటర్ గా చంద్రబాబు ఉన్నారు. ఇపుడు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విధంగా చేస్తామని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   12 Jan 2025 4:11 AM GMT
బాబు  మార్క్ జిల్లా టూర్లు ఉంటాయా ?
X

ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యాక ఒక ట్రెండ్ ని క్రియేట్ చేశారు. అదేంటి అంటే అప్పటిదాకా సీఎం అంటే సచివాలయానికే పరిమితం అయ్యేవారు. కానీ బాబు అలా కాకుండా ఆనాడు ఉన్న మొత్తం 23 జిల్లాలోనూ పర్యటించేవారు. ఆయన ఏ రోజు ఏ జిల్లాకు వస్తున్నారో గోప్యంగా ఉంచేవారు. అలా ఆకస్మిక తనిఖీలు చేపట్టి పాలనను గాడిలో పెట్టేవారు.

ప్రజా సమస్యలను నేరుగా గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి జనాలనే అడిగి తెలుసుకునే వారు. ఒక విధంగా బాబు 1995 నుంచి 2004 మధ్యలో సాగించిన పాలన అంతా చాలా డైనమిక్ గా ఉంటుందని ఇప్పటికీ చెప్పుకుంటారు. బాబు అంటే ఆనాడు అక్రమార్కులకు ఒక టెర్రర్ గా ఉండేది. పాలన సాఫీగా సవ్యంగా సాగడమే కాదు ప్రజలకు కూడా ఎంతో తృప్తిగా ఉండేది. రెడ్ టేపిజానికి నాడు చెక్ పెట్టెశారు. ఎవరు ఆఫీసులకు వెళ్ళినా పనులు చాలా స్పీడ్ గా సాగేవి.

ఇక అలసత్వం వహించే అధికారులు ఉద్యోగుల మీద స్పాట్ లోనే యాక్షన్ ఉండేది. అలా జిల్లాల టూర్లతో చంద్రబాబు ఒక బ్రాండ్ ని క్రియేట్ చేశారు. అయితే 2004లో ఆయన ఓటమికి ఇది ఒక ప్రధాన కారణం అని విశ్లేషణలు వినిపించాయి. ఉద్యోగులు బాబు విషయంలో వ్యతిరేకత పెంచుకోవడంతో ఆయన ఉమ్మడి ఏపీలో 2004, 2009లలో ఓటమి చవి చూశారు

విభజన ఏపీలో మాత్రం బాబు అలాంటి దూకుడు చేయలేదు. ఉద్యోగులతో సామరస్యంగా మెలగుతూ ఫ్రెండీ సర్కార్ అంటూ అయిదేళ్ళూ పాలించారు. ఇదిలా ఉంటే ఇపుడు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్లకు రెడీ అవుతున్నారు. ఆయన ఈ నెల 26 నుంచి జిల్లాల పర్యటనలు చేయడమే కాదు ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తామని చెబుతున్నారు.

ఈ ట్రెండ్ క్రియేటర్ గా చంద్రబాబు ఉన్నారు. ఇపుడు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విధంగా చేస్తామని చెబుతున్నారు. అంతే కాదు తన తనిఖీలలో నిర్లక్ష్యంగా ఎవరైనా అధికారులు వ్యవహరిస్తే మాత్రం తగిన చర్యలు ఉంటాయని కూడా తెలంగాణా సీఎం హెచ్చరిస్తున్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి వీటి విషయంలో క్షేత్ర స్థాయిలో పాలన ఏలా సాగుతోంది అన్నది చూస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు.

ఈ నేపథ్యం నుంచి చూసినపుడు ఆకస్మిక తనిఖీలకు తెలంగాణా సీఎం రెడీ అవుతూంటే తాను 1995 నాటి సీఎం ని అవుతాను నన్ను అలాగే చూస్తారు ఇక మీదట అని తరచూ చెప్పే చంద్రబాబు జిల్లా టూర్లు ఉండవా అన్న చర్చ సాగుతోంది. అయితే బాబు ఆనాడు నాలుగున్నర పదుల వయసులో ఉన్నారని, ఇపుడు ఆయన ఏడున్నర పదుల వయసుకు చేరుకున్నారని అంటున్నారు.

పైగా బాబుకు అనుభవం కూడా ఈ ఆకస్మిక టూర్ల వల్ల వచ్చిందని అందువల్ల ఆయన అధికారుల విషయంలో మరీ దూకుడుగా పోలేరని అంటున్న వారూ ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీల ప్రభావం ఎలా ఉంటుందో కూడా చూడాల్సి ఉంది. అక్కడ ఆయన కనుక దూకుడు పెంచితే కచ్చితంగా మరో తెలుగు రాష్ట్రంగా ఏపీలోనూ పోలిక పెట్టి చూస్తారు. సో అపుడు బాబు కూడా జిల్లాల టూర్లకు రెడీ అవుతారేమో అంటున్నారు.