పోలీసులు వద్దంటే.. అస్సలు వద్దని... డీజీపీ హాట్ కామెంట్స్!!
ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చలు జరిగాయని అంటున్నారు.
By: Tupaki Desk | 26 Dec 2024 10:24 AM GMTఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తెలంగాణ ప్రభుత్వంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చలు జరిగాయని అంటున్నారు. ఈ సందర్భంగ డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
అవును... ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సినీ ప్రముఖుల సమావేశం జరిగిందనే సంగతి తెలిసిందే. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా.. బౌన్సర్లు, సినిమా కార్యక్రమాలకు పోలీసుల అనుమతులు మొదలైన వాటిపై స్పందించారని అంటున్నారు.
ఇందులో భాగంగా... పోలీసుల నిర్ణయాలను టాలీవుడ్ పెద్దలు గౌరవించాలని అన్నారని అంటున్నారు. ఇదే సమయంలో... బౌన్సర్లను నియమించుకునేటప్పుడు న్యాయ సమ్మతం ఉండాలని సూచిస్తూ.. ఇటీవల బౌన్సర్ల తీరు, ప్రవర్తన ఏమాత్రం బాగాలేదని మండిపడ్డారని అంటారు. ఈ సందర్భంగా.. ఏ ఈవెంట్ కి అయినా ముందస్తు అనుమతులు తీసుకోవాలని డీజీపీ సూచించారని తెలుస్తోంది.
ఒకసారి ఏదైనా అనుమతి విషయంలో పోలీసులు వద్దంటే వినాలని డీజీపీ సూటిగా చెప్పారని అంటున్నారు. ఇదే సమయంలో... శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. బౌన్సర్ల విషయంలోనూ సీరియస్ గా ఉంటామని.. ప్రధానంగా బౌన్సర్ల ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, బౌన్సర్లు సహరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారని అంటున్నారు.
కాగా.. ఈ రోజు బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎఫ్.డీ.సీ. ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు.