Begin typing your search above and press return to search.

మహాలక్ష్మీ స్కీమ్‌పై నెటిజన్ ఫైర్.. కీలక ట్వీట్!

అందులో భాగంగానే అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది

By:  Tupaki Desk   |   15 Nov 2024 11:30 AM GMT
మహాలక్ష్మీ స్కీమ్‌పై నెటిజన్ ఫైర్.. కీలక ట్వీట్!
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక ఆరు గ్యారంటీలను ఇచ్చింది. అందులో భాగంగానే అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం మహాలక్ష్మీ స్కీమ్‌ను రూపొందించి అందులోనే ఈ ఫ్రీ జర్నీని చేర్చింది.

అధికారంలోకి రాగానే నెల రోజుల్లోనే ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్‌ను అమలు చేసింది. దాంతో అప్పటి నుంచి మహిళలు కేవలం ఆధార్ కార్డును చూపిస్తే తమ గమ్యాలకు ప్రయాణిస్తున్నారు. అయితే.. ఏ బస్సు చూసినా మహిళలతో నిండి కనిపిస్తోంది. ఇక పురుషులకు కనీసం సీట్లు కూడా దొరకని పరిస్థితి. వందలకు వందలు పెట్టి టికెట్ కొనుగోలు చేసినప్పటికీ నిలబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది.

ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఫ్రీ జర్నీ ఫెసిలిటి కల్పించారు. అయినప్పటికీ ఆ బస్సుల్లో నిండి ప్రయాణిస్తున్నారు. ఏ రూట్‌లో ఎన్ని బస్సులు నడుస్తున్నా అన్ని కూడా మహిళలతో నిండిపోతున్నాయి. దీంతో పురుషులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఒక్క సీటు కోసం ఎన్నో ఫీట్లు చేయాల్సిన పరిస్థితి ఉంది. రన్నింగు బస్సును క్యాచ్ చేస్తూ సీటు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఇక హైదరాబాద్ సిటీ ప్రయాణికుల అవస్థలు చెప్పలేని విధంగా ఉన్నాయి.

అయితే.. తాజాగా మహాలక్ష్మీ స్కీమ్‌పై ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. ఎక్స్ వేదికగా కీలక ట్వీట్ చేశాడు. సిటీ బస్సులో ప్రయాణికులు ప్రమాదకరంగా ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. మహాలక్ష్మీ పథకం వల్ల ప్యాసింజర్లు ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. అవసరమైన చర్యలు తీసుకొని ఈ సమస్యలకు చెక్ పెట్టాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరాడు. స్కూల్ స్టూడెంట్స్ కూడా ఫుట్ బోర్డు వద్ద వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని పేర్కొన్నాడు. కాగా.. దీనిపై స్పందించిన ఆర్టీసీ.. సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.