Begin typing your search above and press return to search.

సీనియర్ సిటిజన్ ప్రాణాలు తీసిన బైక్ రైడర్ ఆగ్రహం... వీడియో!

వివరాళ్లోకి వెళ్తే... అల్వాల్ లో మోటర్ బైక్ పై వెళ్తున్న రైడర్... ఆ సమయంలో రోడ్డు దాటుతున్న సీనియర్ సిటిజన్ పై దాడి చేశాడు.

By:  Tupaki Desk   |   18 Oct 2024 4:48 PM GMT
సీనియర్  సిటిజన్  ప్రాణాలు తీసిన బైక్  రైడర్  ఆగ్రహం... వీడియో!
X

ఇటీవల కాలంలో తోటి మనిషిపై ప్రేమ, అభిమానం సంగతి దేవుడెరుగు.. కనీసం వృద్ధులపై గౌరవం, కరుణ కూడా ఉండటం లేదనే చెప్పాలి! ఈ క్రమంలో రోడ్డుపై వేగంగా వెళ్తున్నవారిని వారించిన పాపానికి ఓ బైక్ రైడర్ ఆగ్రహం ఓ సీనియర్ సిటిజన్ ప్రాణలే తీసింది! తన కోపమే తనకు శత్రువు అనే మాటేమో కానీ.. ఆ రైడర్ కోపం పెద్దాయన ప్రాణాలు తీసింది!

అవును... రోడ్డుపై (భార్యా పిల్లలతో వెళ్తూ కూడా!) వేగంగా వెళ్తున్నాడనో, రద్దీ రోడ్డులో అంత వేగం పనికిరాదనో సూచించిన, వారించిన ఓ సీనియర్ సిటిజన్ పై ఓ బైక్ రైడర్ ఆగ్రహంతో పిడి గుద్దులు గుద్దాడు! దీంతో.. ఆ వృద్ధుడు అక్కడికక్కడే రోడ్డుపై పడిపోయాడు! ఈ ఘటన సీసీ కెమరాలో రియార్డ్ అయ్యింది.

వివరాళ్లోకి వెళ్తే... అల్వాల్ లో మోటర్ బైక్ పై వెళ్తున్న రైడర్... ఆ సమయంలో రోడ్డు దాటుతున్న సీనియర్ సిటిజన్ పై దాడి చేశాడు. సెప్టెంబర్ 30వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ, చిన్నారితో వెళ్తున్న బైక్ రైడర్.. అతివెగంగా వెళ్తున్నాడు. ఈ నిర్లక్ష్యపు ప్రవర్తనపై భయాందోళనకు గురైన ఓ సీనియర్ సిటిజన్ స్పందించారు.

దీంతో... తీవ్ర ఆగ్రహానికి గురైన రైడర్.. తన బైక్ ని ఆపి వృద్ధుడిపై దాడి చేయడం ప్రారంభించాడు! ఈ సమయంలో వృద్ధుడు నడిరోడ్డుపై కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో... బాధితుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు! ఆ రైడర్ క్షణికావేశం విలువ నిండు ప్రాణమన్నమాట!

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు బైక్ రైడర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు! అయితే... ఈ ఘటనకు సంబంధిచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది!