తెలంగాణలో 'సెప్టెంబరు 17' స్టయిలే వేరు!
సెప్టెంబరు 17వ తేదీ రాగానే తెలంగాణలో చిత్రమైన పరిస్థితి నెలకొంటున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 17 Sep 2024 6:53 AM GMTసెప్టెంబరు 17వ తేదీ రాగానే తెలంగాణలో చిత్రమైన పరిస్థితి నెలకొంటున్న విషయం తెలిసిందే. గతం లో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు కాంగ్రెస్ అదికారంలో ఉన్నా కూడా.. ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం.. తెలంగాణ సెంటిమెంటు. బీజేపీ నాయకులు సెప్టెంబరు 17వ తేదీని విమోచన దినోత్సవంగా పేర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరొవైపు బీఆర్ ఎస్ ఉన్నప్పుడు ఒకరకంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేవారు.
ఈ క్రమంలో అటు బీజేపీ, బీఆర్ ఎస్ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. అయితే.. ఇప్పుడు కూడా తెలంగాణలో సెప్టెంబరు 17 రాజకీయం అదేవిధం గా కొనసాగింది.బీజేపీ యథాతథంగా విమోచనం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది. మరోవైపు సీఎం రేవంత్ మాత్రం తెలంగాణ `ప్రజాపాలన దినోత్సవం` పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. పబ్లిక్‌గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపాల్గొన్నారు.
ఇది రాష్ట్ర కార్యక్రమం..
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాను ఫామ్ హౌస్ సీఎంను కాదంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు చురక లు అంటించారు. విమోచనం, విలీనం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదని.. ఇది వ్యక్తుల స్వార్థమేనని వ్యాఖ్యానించారు. పెత్తందార్లు, నియంతలపై పిడికిలి బిగించి చేసిన సాయుధ రైతాంగ పోరాటాన్ని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా పాలన పారదర్శకంగా నిర్వహించాలని భావించి.. ఆదిశగానేఅడుగులు వేస్తున్నట్టు చెప్పారు.
ఇది కేంద్ర కార్యక్రమం..
ఇక, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. తొలుత జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జవాన్ల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఏదేమైనా.. తెలంగాణలో సెప్టెంబరు 17 మాత్రం భిన్నంగా మారిపోవడం గమనార్హం.