Begin typing your search above and press return to search.

తెలంగాణ భవన్ కు వాస్తు దోషాలున్నాయా? అందుకే గేటు మార్చారా?

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం ఎదురు కావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వాస్తు దోషాలను సెట్ చేసుకుంటోంది.

By:  Tupaki Desk   |   4 April 2024 12:15 PM GMT
తెలంగాణ భవన్ కు వాస్తు దోషాలున్నాయా? అందుకే గేటు మార్చారా?
X

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం ఎదురు కావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వాస్తు దోషాలను సెట్ చేసుకుంటోంది. వాస్తు దోషంతోనే పార్టీ కష్టాలు ఎదుర్కొంటోందని నమ్ముతున్నారు. అందుకే అవసరమైన మార్పులు చేపడుతోంది. కార్యాలయంలోకి వెళ్లే గేటు తెలంగాణ భవన్ కు అభిముఖంగా ఉండటంతో వాస్తు దోషాలు వస్తున్నాయని అంటున్నారు.

వాయువ్య దిశలో ఉన్న మరో గేటు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అది ఈశాన్యం వైపు ఉండటంతో రాకపోకలకు అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నారు. వీధిపోటు ఉన్నందున లక్ష్మీనరసింహ స్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని గేటుకు ఏర్పాటు చేశారు. దీంతో వాస్తు దోషం ఉండదని అనుకుంటున్నారు. వాస్తు కోసం బీఆర్ఎస్ పార్టీ కూడా పలు మార్పులు చేపడుతోంది.

రాకపోకలకు వాయువ్యం నుంచి ఈశాన్యం వైపు మార్చడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తీరుతాయని చెబుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వైపు వెళ్లే ప్రధాన రహదారి వెంట వాహనాల రాకపోకలు పెరగడం వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. దీంతో అటుగా వెళ్లే వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో గేటు మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

వాయువ్య గేటు వైపు వాహనాలు నిలిపి ఉంచే పరిస్థితి లేదు. దీంతో ఈశాన్యం గేటును రాకపోకలకు వినియోగించుకుని ట్రాఫిక్ సమస్యల నుంచి బయట పడొచ్చని భావిస్తున్నారు. దీంతో పాటు లోపల కూడా కొన్ని మార్పులు చేపడుతున్నారు. చిన్నచిన్న మార్పులు చేసి వాస్తుకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ వాస్తు ప్రకారం ఉండేలా మెరుగులు దిద్దుతున్నారు.

భాగ్యనగరం రోజురోజుకు డెవలప్ అవుతుంటే ట్రాఫిక్ సమస్య తలెత్తడం మామూలే. అందుకే ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గేటు మార్పు చేసినట్లు చెబుతున్నా అందులో వాస్తు దోషం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ కు వాస్తు ఇబ్బందులు ఉండటం వల్లే ఓటమి బారిన పడినట్లు చెబుతున్నారు. దీంతోనే అందులో మార్పులు చేసి వాస్తుకు సిద్ధంగా తయారు చేసినట్లు సమాచారం.