Begin typing your search above and press return to search.

జస్ట్ శాంపిల్: గులాబీ కారుకు గుదిబండ వాట్సాప్ వర్సిటీ!

తాజాగా కొన్ని మెసేజ్ లు.. పోస్టులు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లోనూ పెద్ద ఎత్తున సర్య్యులేట్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   16 Oct 2023 4:35 AM GMT
జస్ట్ శాంపిల్: గులాబీ కారుకు గుదిబండ వాట్సాప్ వర్సిటీ!
X

వరంగానే కాదు శాపంగా మారుతుంటుంది టెక్నాలజీ. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతో ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన సోషల్ మీడియా.. వాట్సాప్ లాంటి మాధ్యమాలు రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తెలంగాణలో తాజాగా జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో వాట్సాప్ వర్సిటీ క్రియేట్ చేస్తున్న ఆయుధాలు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మొదలు ఇప్పటివరకు పదేళ్లు నాన్ స్టాప్ గా అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కారుకు సవాలుగా మారాయి తాజా ఎన్నికలు.

ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు.. పదేళ్లుగా పాలిస్తున్న వేళ.. కొత్త కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్న భావన కలిగేలా తయారు చేస్తున్న పోస్టులు గులాబీ కారుకు స్పీడ్ బ్రేకర్ల మాదిరి మారాయి. హ్యాట్రిక్ విజయంతో దక్షిణ భారతంలో మరే రాష్ట్రంలో లేని రికార్డును సొంతం చేసుకోవాలని కేసీఆర్ అండ్ కో తపిస్తుంటే.. ఏది ఏమైనా.. ఈసారి మాత్రం లెక్కలు మారాల్సిందే అన్న పట్టుదలతో రాజకీయ పార్టీలు ఉన్నాయి.

ఈ క్రమంలో విపక్షాలకు ఉమ్మడి శత్రువు అయిన అధికార పార్టీని దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. తాజాగా కొన్ని మెసేజ్ లు.. పోస్టులు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లోనూ పెద్ద ఎత్తున సర్య్యులేట్ అవుతున్నాయి. ఆ కోవలోకే వస్తుంది కింద పేర్కొన్న మెసేజ్. ఆ మాటకు వస్తే.. ఈ తరహా మెసేజ్ లు ఈ మధ్య పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి.

పదేళ్లుగా అధికారంలో ఉంటున్న వేళ.. ప్రభుత్వ వైఫల్యాల పేరుతో పలు అంశాల్ని ప్రస్తావిస్తున్న వైనం చూసినప్పుడు.. వీటికి సరైన సమయంలో సరైన రీతిలో సమాధానం ఇవ్వని పక్షంలో.. కీలకమైన ఎన్నికల వేళ భారీ ఎదురుదెబ్బ ఖాయమంటున్నారు.

తాము చెప్పేదే నిజమన్నట్లుగా కొన్ని రాతలు వాట్సాప్ వర్సిటీలో తయారు కావటం తెలిసిందే. తాజాగా వైరల్ గా మారిన ఈ పోస్టు ఆ కోవలోకే చెందిందని గులాబీ పార్టీ వర్గీయులు విరుచుకుపడుతుంటే.. వాస్తవాలు అధికార పక్షానికి అలానే కనిపిస్తాయని విపక్ష పార్టీలకు చెందిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తప్పు పడుతూ వెల్లువెత్తుతున్న పోస్టులకు తాజా పోస్టు ఒక శాంపిల్ మాత్రమేనని చెప్పక తప్పదు.

1👉దళిత ముఖ్యమంత్రి లేడు

2👉దళితులకు మూడేకరల భూమి లేదు

3👉దళిత బందు అందరికి లేదు

4👉బీసీ బంధు అసలే లేదు

5👉ఇంటికో ఉద్యోగం లేదు

6👉పరీక్షలు సరిగా నిర్వహించేది లేదు

7👉నిరుద్యోగ భృతి లేదు

8👉ఉచిత ఎరవు లేదు

9👉రైతు రుణమాఫీ లేదు

10👉రైతుల పంట నష్టం పరిహారం లేదు

11👉డబుల్ బెడ్ రూమ్ అందరికి లేదు

12👉కొత్త రేషన్ కార్డుల ఊసే లేదు

13👉కొత్త పెన్షన్ ఇచ్చేది లేదు

14👉ఉద్యమకారులకు స్వేచ్ఛ లేదు

15👉తెలంగాణ ఉద్యమకారులకు స్థానం లేదు

16👉సామజిక న్యాయం లేదు

17👉పార్టీ పిరయింపులకు అడ్డుఅదుపు లేదు

18👉అప్పులకు లెక్క లేదు

19👉అబద్దలకు అంతం లేదు

20👉అక్రమ కేసులకు న్యాయం లేదు.

21👉కేజీ నుండి పీజీ అమలు లేదు

22👉కుటుంబ పాలనకు అడ్డే లేదు

23👉నిజం షుగర్ ప్యాక్టరి తెరిచేది లేదు.

24👉కెసిఆర్ కుటుంబ ఆస్తులకు లెక్కే లేదు.

25👉తెలంగాణ 5లక్షల కోట్ల అప్పు కెసిఆర్ కె సాధ్యం

26👉ఫామౌస్ C/O అంటే కెసిఆర్

27👉కెసిఆర్ మోసపూరిత హామీలకు అంతే లేదు

28👉మైనార్టీ బందు లేదు 👉ఇట్లా చెప్పుకుంటూ పోతే పొద్దు వోడవది.. ఒక్కసారి బాగా ఆలోచించి ఓటు వేయండి ప్లీజ్.. 🙏..