Begin typing your search above and press return to search.

క్లైమాక్స్ కి తెలంగాణా ప్రచారం : మైకుల బంద్ కి కౌంట్ డౌన్....!

తెలంగాణా ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కి చేరింది. మైకుల బంద్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి కొద్ది గంటలలో తెలంగాణాలో యుద్ధం ముందు నిశ్శబ్ధం తాండవిస్తుంది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 12:30 AM GMT
క్లైమాక్స్ కి  తెలంగాణా ప్రచారం :  మైకుల బంద్ కి కౌంట్ డౌన్....!
X

తెలంగాణా ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కి చేరింది. మైకుల బంద్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి కొద్ది గంటలలో తెలంగాణాలో యుద్ధం ముందు నిశ్శబ్ధం తాండవిస్తుంది. దాదాపుగా రెండు రెలల నుంచి హోరు పెట్టించిన నేతలు వారి ప్రచారాలు ఆగిపోతాయి.

ఈ రోజు సాయంత్రం అయిదు గంటలతో తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడుతుంది. ఆ తరువాత నలభై ముప్పయి ఆరు గంటలలో పోలింగ్ కి తెర లేస్తుంది. ఎలా చూసుకున్నా తెలంగాణా ఎన్నికల సమరానికి తుది ఘట్టం మొదలైంది.

దేశాన్ని ఏలే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి వారు బీజేపీ తరఫున వరసబెట్టి ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలతో పాటు బీజేపీకి మద్దతుగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా సభలలో పాల్గొంటున్నారు. తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ జి కిషన్ రెడ్డి సైతం జోరు పెంచారు.

బీయారెస్ నుంచి కేసీయార్ రోజుకు నాలుగైదు సభలను నిర్వహిస్తున్నారు. ఆయన ఉదయం నుంచి రాత్రి వరకూ సుడిగాలి పర్యటనలే చేస్తున్నారు కేటీయార్ అయితే ఒక వైపు రోడ్ షోలు మరో వైపు సభలతో హుషార్ చేస్తున్నారు. హరీష్ రావు కూడా భారీ సభలనే నిర్వహిస్తున్నారు. అలా బీయారెస్ లో అగ్ర నాయకత్వం స్పీడ్ గానే ఉంది.

కాంగ్రెస్ నుంచి చూస్తే రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీలు గతం కంటే ఎక్కువగా సభలలో పాలుపంచుకున్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టగా తీసుకుంది. దాంతో యువ గాంధీలు ఇద్దరూ వరస సభలతో తెలంగాణాలో జోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పలు సభలలో ప్రసంగించడం ద్వారా కాంగ్రెస్ కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోజుకు మూడు నాలుగు సభలలో ప్రసంగాలు చేస్తూ అలుపు లేదనిపించుకుంటున్నారు. ఇలా తెలంగాణాలో మూడు ప్రధాన పార్టీలు వేటికవే తమ వ్యూహాలతో ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నాయి. వీరికి తోడుగా బీయారెస్ నుంచి చూస్తే మహిళా నాయకురాలు కవిత, కాంగ్రెస్ నుంచి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు.

బీజేపీ నుంచి బండి సంజయ్, ఈటెల రాజేందర్ వంటి వారు పలు నియోజకవర్గాలను చుట్టబెడుతున్నారు. మొత్తానికి చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలంగాణా ఎన్నికల ప్రచారం సాగింది అని చెప్పాలి. జనాల మద్దతు కోసం నాయకులు రకరకాలైన ప్రయత్నాలు చేశారు. అలాగే విన్యాసాలు కూడా చేశారు. మరి ప్రచారం ఆగిపోతే జనాలు తమ తీర్పుకి పదును పెడతారు అని అంటున్నారు