కేంద్రంలో తెలంగాణ మంత్రులు..ఏం సాధిస్తారు?
తెలంగాణ నుంచి తాజాగా ఇద్దరికి కేంద్రంలో మంత్రి పదవులు దక్కాయి. అయితే.. వాస్తవానికి గతంలోనూ ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు
By: Tupaki Desk | 11 Jun 2024 7:00 AM GMTతెలంగాణ నుంచి తాజాగా ఇద్దరికి కేంద్రంలో మంత్రి పదవులు దక్కాయి. అయితే.. వాస్తవానికి గతంలోనూ ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. 2014-19 మధ్య కిషన్ రెడ్డి, దత్తాత్రేయలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. వీరివల్ల ఒరిగింది ఏమీ లేదనే విమర్శలు అప్పట్లో మూటగట్టుకున్నారు. ఇక, మోడీ 2.0లో కిషన్ రెడ్డికి మాత్రమే మంత్రి పదవి దక్కింది. అది కూడా.. పర్యాటక శాఖ స్వతంత్ర హోదాలో కట్టబెట్టారు. దీంతో ఆయన పెద్దగా చేసేందుకు స్కోప్ లేకుండా పోయింది.
ఇక, ఇప్పుడు ఫైర్ బ్రాండ్ బండి సంజయ్‌కి తొలిసారి, కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం చిక్కింది. అయితే.. ఇప్పుడు కూడా.. ఏమేరకు వారు తెలంగాణకు సాయం చేస్తారనే విషయంలో సందేహాలు ముసురుకున్నా యి. దీనికి కారణం.. బండి సంజయ్.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా అవకాశం చిక్కించుకున్నారు. కానీ, దీని వల్ల తెలంగాణకు పెద్దగా అవకాశం లేదు. తెలంగాణ వాదం.. కోరికలు.. ఇతరత్రా నెరవేర్చేందు కు పెద్దగా చాన్స్ ఉండే అవకాశం కనిపించడం లేదు.
ఉన్నా కూడా.. బండి సంజయ్‌కు పరిమితమైన అవకాశాలు మాత్రమే ఉంటాయి. సికింద్రాబాద్ కంటో న్మెంటు సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. అయితే.. దీనికి కూడా హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా సంతకం అవసరం. చిత్రం ఏంటంటే.. గతంలో కిషన్ రెడ్డి కూడా సహాయ మంత్రిగా పనిచేశారు. కానీ, ఆయన కూడా ఈ సమస్యను పరిష్కరించలేక పోయారు. ఇక, బండి సంజయ్ ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
ఇక, తాజాగా మంత్రివర్గంలో మరో సారి చోటు దక్కించుకున్న కిషన్ రెడ్డికి.. బోగ్గు, గనుల శాఖను కేటాయిం చారు. ఇది ఒకరకంగా కీలకమైన శాఖేనని చెప్పాలి. ఎందుకంటే సింగరేణి బొగ్గు గని దేశంలో కెల్లా పెద్దది. దీనికి మరింత ప్రాధాన్యం పెంచేందుకు సమస్యలు తగ్గించేందుకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీలో గనుల వ్యవహారాల విషయంలో కూటమి ప్రభుత్వానికి సాయం చేయొచ్చు. అయితే.. ఏమేరకు పనిచేస్తారనేది చూడాలి. మొత్తంగా ఇద్దరికి అవకాశం చిక్కినా.. ఒక్కరికి మాత్రం ప్రాధాన్యం ఉన్న పదవి దక్కడం గమనార్హం.