Begin typing your search above and press return to search.

ఈసారి సారు బర్త్ డేకు హడావుడి మామూలుగా లేదుగా?

అసలే ఎన్నికల కాలం. ఇలాంటి వేళలో.. అధికార పార్టీ అధినేత పుట్టిన రోజు వస్తే అంతకు మించిన కార్యక్రమం ఏముంటుంది? ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణలో నెలకొంది.

By:  Tupaki Desk   |   23 July 2023 4:51 AM GMT
ఈసారి సారు బర్త్ డేకు హడావుడి మామూలుగా లేదుగా?
X

అసలే ఎన్నికల కాలం. ఇలాంటి వేళలో.. అధికార పార్టీ అధినేత పుట్టిన రోజు వస్తే అంతకు మించిన కార్యక్రమం ఏముంటుంది? ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణలో నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు జులై 24. మామూలుగా అయితే ఆయన పుట్టినరోజుకు ఒక రోజు ముందు.. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీల హడావుడి ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం హడావుడి రెండు రోజుల ముందు నుంచే మొదలైంది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలలకు తక్కువకు వచ్చేసిన వేళ.. టికెట్లు ఆశిస్తున్న ఆశావాహులు పెద్ద సారు మీద తమకున్న అభిమానాన్ని ఫ్లెక్సీల పేరుతో చాటుకుంటున్నారు. ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటంతో హైదరాబాద్ మహానగరంలోని పలుచోట్ల పెద్ద సారు ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం కనిపిస్తోంది. మియాపూర్ నుంచి ఎల్ బీ నగర్ వరకు ఉన్న మెట్రో రైల్ పిల్లర్లకు ఇప్పటికే కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్లను రూపొందించారు.

ఇలా పోస్టర్లు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిలో ఎక్కువగా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ .. కర్నాటి విద్యాసాగర్ ముందున్నారు. బొంతు ఉప్పల్ టికెట్ ను ఆశిస్తుంటే.. కర్నాటి మునుగోడు టికెట్ ను ఆశిస్తున్నారు. టికెట్ల ఆశావాహులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగటంతో ఇప్పుడు పోస్టర్ వార్ మొదలైంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పుట్టిన రోజుకు ఒక రోజు ముందు పోస్టర్లు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పలువురు నేతలు భావించారు.

అందుకు భిన్నంగా కొందరు నేతలు ముందుచూపుతో రెండు రోజుల ముందే ఫెక్ల్సీలు.. పోస్టర్లు ఏర్పాటు చేయటంతో.. ఈ రేసులో వెనుకబడిపోయినట్లుగా తెగ బాధ పడిపోతున్నారు. మొత్తంగా కేసీఆర్ పుట్టిన రోజు.. అందునా ఎన్నికల ఏడాది కావటంతో పెద్ద సారు కంట్లో పడేలా.. మనసు దోచుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.