Begin typing your search above and press return to search.

కేసీయార్ ని సప్త దిగ్బంధనం చేసిన కాంగ్రెస్

రాజకీయాల్లో ఎన్నో వ్యూహాలు ఉంటాయి. కురుక్షేత్ర మహా సంగ్రామంలో పద్మవ్యూహం అమలు చేసి అభిమన్యుడు అంతటి వీరుడిని నేల కూల్చారు

By:  Tupaki Desk   |   18 Sep 2023 3:46 AM GMT
కేసీయార్ ని సప్త దిగ్బంధనం చేసిన కాంగ్రెస్
X

రాజకీయాల్లో ఎన్నో వ్యూహాలు ఉంటాయి. కురుక్షేత్ర మహా సంగ్రామంలో పద్మవ్యూహం అమలు చేసి అభిమన్యుడు అంతటి వీరుడిని నేల కూల్చారు. అది యుద్ధ తంత్రం. ఇపుడు దానినే కాంగ్రెస్ తెలంగాణాలో అమలు చేస్తోంది.

కేసీయార్ వంటి వ్యూహకర్తను ఢీ కొట్టాలంటే అంతే స్థాయి వ్యూహాలు అమలు చేయడం అవసరం అన్నది కాంగ్రెస్ ఆలోచనలుగా కనిపిస్తున్నాయి. మరో వైపు కర్నాటక ఫార్ములా కూడా కాంగ్రెస్ కి కలసి వస్తోంది. అక్కడ ఇచ్చిన హామీలు జనాలు రిసీవ్ చేసుకున్న తీరుని కూడా తెలంగాణా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడుతోంది.

తాము అధికారంలోకి వచ్చిన వంద రోజులలోగా అమలు చేసే ఆరు కీలక హామీలతో కాంగ్రెస్ ముందుకు వచ్చింది. నిజంగా ఈ హామీలు చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈసారి ఎటూ కేసీయార్ కి యాంటీ ఇంకెంబెన్సీ దెబ్బ ఉంటుంది. దానికి ఓవర్ కం చేసి రావాలని ఆయన చూస్తున్నా కాంగ్రెస్ మాత్రం ఆ చాన్స్ అసలు ఇవ్వకుండా సప్త దిగ్బంధనం చేయడమే అజెండాగా పెట్టుకుంది.

అందుకే కాంగ్రెస్ కచ్చితమైన హామీలనే ఎంచుకుని జనం ముందుకు వచ్చింది. తుక్కుగూడలో జరిగిన విజయభేరీలో ఈ హామీలను స్వయంగా కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ఇవ్వడం విశేషం. ఆమె తాను తెలంగాణాను ఇచ్చాను అని చెబుతూనే ప్రజల జీవితాల్లో కొత్త మార్పుల కోసం ఈ హామీలు అంటూ ప్రకటించారు

అవేంటో చూస్తే కాంగ్రెస్ టార్గెట్ చేసిన ఓటు బ్యాంక్ సెక్షన్లు కూడా తేటతెల్లంగా తెలిసిపోతాయి. ఇక ఆయా వర్గాలను తన వైపు తిప్పుకోవడం ద్వారా బీయారెస్ ఆట కట్టించేలా ఈ హామీలు ఉన్నాయని అంటున్నారు. అందులో మొదటిది మహాలక్ష్మి పథకం అని చెప్పాలి. ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ.2,500 చెల్లిస్తారు. అలాగే రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందజేస్తారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది.

ఆలోచిస్తే ఈ పధకం సూపర్ గానే ఉంది అనిపిస్తోంది. అలాగే రెండవ పధకంగా తీసుకున్నది రైతు భరోసా. ఈ పధకం కింద రైతులకు, కౌలు రౌతులకు ప్రతి ఏడాది రూ.15 వేలు. వ్యవసాయ కూలీలకు ప్రతి ఏడాది రూ.12 వేలు. వరి పంటకు క్వింటాల్ పై రూ.500 బోనస్ ఇలా కాంగ్రెస్ హామీలు కొనసాగాయి.

అదే విధంగా మూడవ పధకంగా గృహ జ్యోతి పేరుతో నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ని ఇవ్వడం. ఇది కూడా సామాన్యులు, మధ్యతరగతి వర్గాలకు ఊరటను ఇచ్చే స్కీమ్ గానే చూస్తున్నారు. ఇక నాలుగవ పధకంగా చూస్తే ఇందిరమ్మ ఇళ్లు పేరుతో ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు. ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు. తెలంగాణ కోసం పోరాడిన యోధులకు 250 చదరపు గజాల స్థలం. ఇది నిజంగా కాంగ్రెస్ మదిలో మెదిలిన మరో అద్భుత ఆలోచనగా చెప్పాలని అంటున్నారు

ఇక అయిదవ పధకంగా యూత్ ని టార్గెట్ చేశారు. ఆ పధకం పేరే . యువ వికాసం. ఈ పధకం ద్వారా తెలంగాణలోని విద్యార్థులకు రూ.5 లక్షల విలువ చేసే విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలోనూ ఇంటర్నేషనల్ స్కూళ్లు ఏర్పాటు అన్నది కాంగ్రెస్ ఇస్తున్న కీలక హామీగా ఉంది

ఆఖరుగా ఆరవదిగా ఉన్న పధకం పేరు చేయూత. ఈ పధకం ద్వారా అర్హులైన వారికి నెలకు రూ.4 వేల చొప్పున పెన్షను. రూ.10 లక్షల మేర రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా సదుపాయం వంటివి కల్పిస్తారు. సో ఈ పధకం కూడా కాంగ్రెస్ టార్గెట్ సెక్షన్లకు రీచ్ అయ్యేలా ఉంది.

మొత్తంగా సమీక్షించుకుంటే కనుక ఈ ఆరు పధకాలు జనంలో తీవ్ర చర్చకే దారితీస్తాయి. మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి వర్గాల మీద కాంగ్రెస్ ఫోకస్ చేసి స్టడీ చేసి ఇచ్చిన హామీలు కనుక జనం బుర్రలోకి వెళ్తే కనుక కచ్చితంగా అది బీయారెస్ కి కేసీయార్ కి సప్త దిగ్బంధనం అయి తీరుతుంది అంటున్నారు. సో ఎలా ఈ పధకాలు జనంలోకి చేరుస్తారు అన్నది టీ కాంగ్రెస్ నేతల శ్రమ పరిశ్రమల మీద ఆధారపడి ఉంది.