కాంగ్రెస్ కు పెరుగుతున్న మౌత్ టాక్
తెలంగాణా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మౌత్ టాక్ చాలా కీలకంగా మారుతున్నది. ఈ మౌత్ టాక్ లో కాంగ్రెస్ కు పాజిటివ్ టాక్ పెరుగుతున్నది
By: Tupaki Desk | 19 Nov 2023 6:20 AM GMTతెలంగాణా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మౌత్ టాక్ చాలా కీలకంగా మారుతున్నది. ఈ మౌత్ టాక్ లో కాంగ్రెస్ కు పాజిటివ్ టాక్ పెరుగుతున్నది. చాలా వర్గాల్లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అనే మౌత్ టాక్ అంటే మౌత్ పబ్లిసిటీ పెరిగిపోతోందన్నది వాస్తవం. కాంగ్రెసే అధికారంలోకి రాబోతోందనే మాటను చెప్పేవాళ్ళంతా పోలింగ్ రోజున ఏమిచేస్తారో మాత్రం తెలీటం లేదు. ముందైతే పబ్లిసిటీ మాత్రం కాంగ్రెస్ కు పాజిటివ్ గా పెరిగిపోతోంది.
ఒక సినిమా రిలీజవ్వగానే మౌత్ పబ్లిసిటి అన్నది చాలా కీలకం అన్న విషయం అందరికీ తెలిసిందే. పేపర్లలో మీడియాలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లను జనాలు నమ్మటం ఎప్పుడో మానేశారు. వెబ్ సైట్లలో వచ్చే రివ్యూలకు కొంతవరకు విలువ ఉంటోంది. ఇదే సమయంలో సినిమా రిలీజవ్వగానే జనాల చెప్పే అభిప్రాయాలకే ఎక్కువ విలువుంటుంది. దీన్నే మౌత్ టాక్ లేదా మౌత్ పబ్లిసిటి అనంటారు. సినిమా బాగుందని జనాలు చెబితే అదివిన్న వాళ్ళు తాము సినిమాను చూడకపోయినా సినిమా బాగుందట అని మరో పదిమందికి చెబుతారు.
అలా అలా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేస్తుంది. సినిమా హిట్ అవ్వటంలో ఇలాంటి మౌత్ పబ్లిసిటి చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇపుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇదే జరుగుతోంది. ఎక్కడచూసినా కాంగ్రెస్ గెలిచేస్తుందనే మౌత్ టాక్ వినబడుతోంది. ఆటో డ్రైవర్లు, సర్వెంట్ మైడ్స్, కూరగాయలు, పండ్లు అమ్ముకునే వాళ్ళతో పాటు వివిధ వృత్తుల వాళ్ళలో మెజారిటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందని చెబుతున్నారు. మళ్ళీ వీళ్ళల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాకపోయినా కేసీయార్ అయితో ఓడిపోతారని మాత్రం గట్టిగా చెబతున్నారు.
చూడబోతే ఇది కూడా అంటే మౌత్ పబ్లిసిటి కూడా పబ్లిసిటిలో ఒక ఎత్తుగడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గతంలో ఇలాంటి ఎత్తుగడను ఏ పార్టీ కూడా సీరియస్ గా ఫాలో అయినట్లు లేదు. నిజానికి ఇది ఎత్తుగడేనా లేకపోతే నిజంగానే వివిధ వర్గాల్లోని వాళ్ళల్లో కేసీయార్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందో అర్ధంకావటంలేదు. ఏదేమైనా గెలుపుకోసం పార్టీలు అనేక ఎత్తులు వేస్తుండటం మామూలే కదా.