Begin typing your search above and press return to search.

సంబ‌రాల‌కు సిద్ధం.. రేవంత్ పిలుపు!

రాష్ట్ర వ్యాప్తంగా దుమ్మురేపే రీతిలో నాయకులు, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు

By:  Tupaki Desk   |   30 Nov 2023 3:44 PM GMT
సంబ‌రాల‌కు సిద్ధం.. రేవంత్ పిలుపు!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగియ‌డం.. ఆ వెంట‌నే ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు రావ‌డం.. అవి కూ డా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండ‌డంతో కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. పార్టీ కేడ‌ర్ అంతా కూడా..సంబ‌రాలు చేసుకోవాల‌ని.. ఆయ‌న పిలుపునిచ్చారు. ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు త‌ప్పుకాద‌ని రేవంత్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం తథ్యమని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా దుమ్మురేపే రీతిలో నాయకులు, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు. తాజాగా ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్‌పై హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడగొడుతున్నామని.. గ‌జ్వేల్‌లోనూ ప్ర‌జ‌లు దొర అహంకారాన్ని త‌గ్గిస్తున్నార‌ని.. రేవంత్ చెప్పుకొచ్చారు.

ఇన్నాళ్లూ అధికారమే శాశ్వతమని కేసీఆర్ నమ్మారని, తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 3న శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచారని, అదే రోజున ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విష‌యం.. ప్ర‌జా తెలంగాణ విజ‌యంగా తాము భావిస్తున్నామ‌ని, అంద‌రి కృషీ ఉంద‌ని చెప్పారు.

"నిద్రపోకుండా పహారా కాసి ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడకొట్టి నందుకు ధన్యవాదాలు. ఓటమి అంచున ఉన్నప్పుడల్లా స్థానాలు మార్చారు. మా వాళ్ళు వల వేసి ఇక్కడ ఓడగొట్టడం అభినందనీయం. కామారెడ్డి ఓటర్లు చైతన్యవంతులు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు ఓడించారు. శ్రీకాంతచారి ఆత్మకు ప్రగాఢ నివాళి. డిసెంబర్ 3న తన తుదిశ్వాస వదిలాడు. ఆరోజే ఎన్నికల ఫలితం రానుంది. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది'' అని అమిత సంతోషం మ‌ధ్య రేవంత్ వెల్ల‌డించారు.

కేటీఆర్‌కు స‌వాల్‌!

''ఎగ్జిట్ పోల్స్ తప్పంటున్నావు కదా.. ఒకవేళ అవి నిజమైతే నువ్వు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్తావా'' అని బీఆర్ ఎస్ నాయ‌కుడు, మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి.. రేవంత్ వ్యాఖ్యానించారు. పాలక పక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కేసీఆర్ గెలిస్తే రాజు, ఓడితే బానిస అనేలా పనిచేశారు. కానీ, కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుందన్నారు. ''మేము పాలకులం కాదు.. సేవకులం. 4 కోట్ల ప్రజలు మనకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు'' అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.