Begin typing your search above and press return to search.

రేవంత్‌కు మ‌రో టాస్క్‌.. కాంగ్రెస్ పెద్ద బ‌రువే పెడుతోందా!

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అన‌గానే.. ఒక స్త‌బ్ద‌త‌..మ‌రింత సైలెంట్‌.. క‌నిపించ‌ని నాయ‌కులు.. వినిపించ‌ని గ‌ళాల గురించే చ‌ర్చ వ‌స్తుంది

By:  Tupaki Desk   |   31 Dec 2023 8:18 AM GMT
రేవంత్‌కు మ‌రో టాస్క్‌.. కాంగ్రెస్ పెద్ద బ‌రువే పెడుతోందా!
X

తెలంగాణ‌లో కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చిన ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి.. ఇక‌పై ఏపీపైనా దృష్టి పెట్ట‌నున్నారా? ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌డేలా.. ఆయ‌న సేవ‌ల‌ను పార్టీ వినియోగించుకునేం దుకు రెడీ అయిందా? వ్యూహ ప్ర‌తివ్యూహాల‌కు కేంద్రంగా ఉన్న ఏపీలో కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేసేలా రేవంత్‌కు ప‌ర్య‌వేక్ష‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు కాంగ్రెస్ నాయ‌కులు. ప్ర‌స్తుతం ఈ వ్యూహానికి పార్టీఅధిష్టానం కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అన‌గానే.. ఒక స్త‌బ్ద‌త‌..మ‌రింత సైలెంట్‌.. క‌నిపించ‌ని నాయ‌కులు.. వినిపించ‌ని గ‌ళాల గురించే చ‌ర్చ వ‌స్తుంది. క‌నీసం ఇప్పుడు జెండాలు మోసేందుకు కూడా నాయ‌కులు లేని ప‌రిస్థితి లో ఏపీ కాంగ్రెస్ పార్టీ కునారిల్లిపోయింది. రాష్ట్ర విభ‌జ‌న‌ను కాద‌న్న ఏపీప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను పార్టీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోవ‌డం.. క‌నీసం అప్ప‌టి ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కూడా లెక్క చేయ‌కుండా రాష్ట్రాన్ని విభ‌జించార‌నే ఆవేద‌న ఉంది. అయితే.. ఇప్పటికి ఇదిజ‌రిగి ప‌దేళ్లు జ‌రిగిపోయాయి.

ఈ నేప‌థ్యంలో అంతో ఇంతో ఏపీ ప్ర‌జ‌లు శాంతించార‌నేది కాంగ్రెస్‌భావ‌న‌. ఈ క్ర‌మంలో వ్యూహాత్మకంగా త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య వైఎస్ ష‌ర్మిల‌ను ఏపీలో దింప‌డం తోపాటు.. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాల‌ను కూడా అప్ప‌గిస్తుంద‌ని అంటున్నారు. ఇక, ఏపీ కాంగ్రెస్ బాధ్య త‌ల‌ను ష‌ర్మిల చేప‌డితే.. తాము పార్టీలో చేర‌తామంటూ.. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వంటి నాయ‌కులు ప్ర‌క‌టిం చడంతో పార్టీ పుంజుకుంటుంద‌నే ఆశ‌లు చిగురిస్తున్నాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యానికి తోడు ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి ఏపీపై జోక్యం చేసుకుం టే..మ‌రింత మంది పార్టీలో చేరేందుకు అవ‌కాశం ఉంటుంద‌నేచ‌ర్చ పార్టీలో జ‌రుగుతోంది. ఇదే విష‌యా న్ని ఇటీవ‌ల ఏపీ నేత‌లు.. పార్టీ అధిష్టానానికి కూడా విన్న‌వించార‌ని.. దీనికిఅధిష్టానంకూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింద‌ని కొంద‌రు చెబుతున్నారు.

అయితే..ఈ విష‌యంలో రేవంత్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార నేది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ను ఆయ‌న డీల్ చేయాల్సి ఉంది. మ‌రోవైపు పాల‌న ప‌రంగా అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో రేవంత్ ఎలా ముందుకు సాగుతారు..? అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుంది? అనేది ఆస‌క్తిగా మారింది.