Begin typing your search above and press return to search.

తెలంగాణా కాంగ్రెస్ సీఎం ఎవరో తెలిసిపోయిందా...?

కొన్ని పార్టీలు పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే ఆఖరుకు కాంగ్రెస్ టికెట్ రాక రెబెల్స్ గా దిగిన వారు కూడా మనసు మార్చుకున్నారు అంటే కాంగ్రెస్ గాలి వారికి కూడా అర్ధం అయిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 1:30 AM GMT
తెలంగాణా కాంగ్రెస్ సీఎం ఎవరో తెలిసిపోయిందా...?
X

తెలంగాణాలో కాంగ్రెస్ కి అధికారంలోకి రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఒక విధంగా చూస్తే పదేళ్ల బీయారెస్ పాలన తరువాత తెలంగాణా ప్రజలలో ఒక అభిప్రాయం ఉంది అని అంటున్నారు. ఈసారి చాన్స్ కాంగ్రెస్ కి ఇద్దామని అనుకుంటున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో కూడా ధీమా పెరిగింది. ఇక అనేక సంకేతాలు కూడా కాంగ్రెస్ కి అనుకూలంగానే సాగుతున్నాయి.

కొన్ని పార్టీలు పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే ఆఖరుకు కాంగ్రెస్ టికెట్ రాక రెబెల్స్ గా దిగిన వారు కూడా మనసు మార్చుకున్నారు అంటే కాంగ్రెస్ గాలి వారికి కూడా అర్ధం అయిందని అంటున్నారు. సరే కాంగ్రెస్ రేపటి రోజున జనాలు మెచ్చి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారు అన్నదే ఇపుడు అతి పెద్ద ప్రశ్న.

కాంగ్రెస్ అంటేనే ఒక మహా సముద్రం. అందులో అందరూ సీఎం క్యాండిడేట్ లే అని చెప్పాలి. లిస్ట్ చదువుకుంటే వీ హనుమంతరావు నుంచి మొదలెడితే కుందుర్తి జానారెడ్డి వంటి కురు వృద్ధుడితో పాటు కోమటి రెడ్డి వెంటకరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారితో పాటు ఎటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉంటారు. అలాగే సీఎల్పీ లీడర్ గా భట్టి విక్రమార్క ఉండనే ఉన్నారు.

అయితే కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సీఎం అభ్యర్ధి ఎంపికలో మాత్రం ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటుంది అని అంటున్నారు. దానికి ఉదాహరణ పొరుగున ఉన్న కర్నాటక సీఎం ఎంపిక అని అంటున్నారు. అక్కడ అనుభవంతో పాటు సామాజిక సమతూల్యత బడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక జరిగింది. 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఇలా చేశారు అని అంటున్నారు. ఇక తెలంగాణాలో అదే ఫార్ములాను అనుసరిస్తారు అని అంటున్నారు.

తెలంగాణాలో ఎందరు పోటీ పడినా కాంగ్రెస్ చివరికి మల్లు భట్టి విక్రమార్క వద్ద ఆగుతుంది అంటున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత అంకిత భావం కలిగిన నాయకుడు. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు 2018 ఎన్నికల్లో గెలిస్తే అందులో పన్నెండు మంది గోడ దాటేసి బీయారెస్ లో చేరిపోయారు. కానీ ఏడుగురుతోనే అసెంబ్లీలో భట్టి ప్రభుత్వం మీద గట్టిగా పోరాటం చేశారు.

ఆయన విధేయత అలా ఉంటుంది. అదే విధంగా ఆయన పార్టీలో చిరకాలంగా ఉంటూ వస్తున్నారు. 2009 నుంచి ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆయన ఖమ్మం జిల్లా మధిర నుంచి నాలుగవ సారి పోటీకి దిగుతున్నారు. ఆయనకు సీనియర్ల నుంచి కూడా ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు.

దాంతో పాటు కేసీయార్ 2014 ఎన్నికలకు ముందు ఒక మాట అన్నారు. తెలంగాణా వస్తే దళితుడికి సీఎం పదవి అని. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. అయితే కాంగ్రెస్ ఇపుడు ఆ మాటను నిలబెట్టుకుని కేసీయార్ కి గట్టి ఝలక్ ఇస్తుంది అని అంటున్నారు.

అదే విధంగా బడుగులు బలహీన వర్గాలకు పెద పీట వేశామన్న నినాదంతో 2019 ఎన్నికల్లో కూడా తెలంగాణాలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునే చాన్స్ ఉంది అని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పక్కా ప్లాన్ తోనే ఉంది అని అంటున్నారు. ఇక సీనియర్లు అనేకమంది సీఎం పదవికి పోటీ పడుతున్న వేళ కాంగ్రెస్ బ్రహ్మాండమైన కార్డుని తీసి తన సెలెక్షన్ ఈజ్ బెస్ట్ అని చెప్పనుంది అంటున్నారు.