రేవంత్ Vs ఉత్తమ్ Vs జీవన్ రెడ్డి Vs కోమటి రెడ్డి...సీఎం ఎవరు...?
కాంగ్రెస్ తెలంగాణా అంతటా సత్తా చాటుతోంది. ఈ నేపధ్యంలో అందరి ఆలోచనలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు అన్న దాని మీదనే
By: Tupaki Desk | 3 Dec 2023 6:45 AM GMTమొత్తానికి అనుకున్నట్లుగానే కాంగ్రెస్ గెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అవుతున్నాయి. కాంగ్రెస్ మంచి ఊపు మీద ఉన్నట్లుగా తొలి రౌండ్ల నుంచే అర్ధం అవుతోంది. కాంగ్రెస్ సింపుల్ మెజారిటీ కాదు మంచి మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని స్పష్టం అవుతోంది.
కాంగ్రెస్ తెలంగాణా అంతటా సత్తా చాటుతోంది. ఈ నేపధ్యంలో అందరి ఆలోచనలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు అన్న దాని మీదనే. ఎందుకంటే ప్రజలు కూడా కాంగ్రెస్ ని చూసి ఓటేశారు. రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంకా గాంధీల మీద నమ్మకం ఉంచి ఓటేశారు.
గ్రాస్ రూట్ లెవెల్ లో కాంగ్రెస్ ఇంకా ఉంది అన్నది అర్ధం అయ్యేలా కూడా ఓటేశారు. అలాగే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కోసం చాలా కష్టపడ్డారు. మిగిలిన సీనియర్ నేతలు కూడా జిల్లాల స్థాయిలో ఎవరికి వారుగా కాంగ్రెస్ గెలుపునకు కృషి చేశారు.
మొత్తానికి కాంగ్రెస్ తెలంగాణాలో పరుగులు పెడుతోంది. కాంగ్రెస్ గెలుపు ఒక విధంగా ప్రజా విజయంగా కూడా చూడాలని అంటున్నారు. ఇపుడు కాంగ్రెస్ సీఎం గా ఎవరు ఉంటారు అన్నదే చర్చకు వస్తోంది. కాంగ్రెస్ నుంచి పది మంది ముఖ్యమంత్రి అభ్యర్ధులు అని అంతా అంటున్నా కూడా దాన్ని మరింతగా షార్ట్ లిస్ట్ చేస్తే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందు భాగాన ఉన్నారు. ఆయన తరువాత వరసలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే జీవన్ రెడ్డి ఉన్నారు, కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు.
ఈ నలుగురికీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ముందుగా రేవంత్ విషయానికి వస్తే ఆయన పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ గ్రాఫ్ ని బాగా పెంచేసారు. ఎక్కడో ఉన్న కాంగ్రెస్ ని తన పదునైన పోరాటాలతో వాక్చాతుర్యంతో ముందు వరసలోకి తెచ్చారు. కేసీయార్ మీద అలుపెరగని పోరాటం చేశారు.
సో రేవంత్ రెడ్డి సీఎం కి అన్ని విధాలుగా అర్హుడు అని అంతా ఒప్పుకుంటారు. అయితే ఆయన కాంగ్రెస్ లో ఆరేళ్ళ నుంచి మాత్రమే ఉన్నారు. అదే ఆయనకు మైనస్ అవుతోంది. ఆయన కంటే ముందు నుంచి దశాబ్దాల నుంచి ఉన్న వారు ఉన్నారు. అలా రేవంత్ రెడ్డి విషయంలో ఆలోచనలు ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడా వస్తుంది.
ఆయన సుదీర్ఘ కాలం కాంగ్రెస్ కి పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయన అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి ఉన్నారు. బలమైన నేత. విధేయతకు మారు పేరు. కాంగ్రెస్ హై కమాండ్ కి ఆయన అంటే ఇష్టం ఉంది. ఆయనకు చాన్స్ ఉంది. కానీ ఆయన మృదు స్వభావం ఒకింత మైనస్ అవుతుందా అన్న చర్చ ఉంది. అక్కడ ఉన్నది కేసీయార్ ఆయనతో ఢీ అంటే ఢీ కొట్టాలి. అందువల్ల ఉత్తం విషయంలో ఇదే మైనస్ అంటున్నారు.
ఇక జీవన్ రెడ్డి విషయం తీసుకుంటే ఈయన సీనియర్ మోస్ట్ లీడర్. కేసీయార్ ని ఎదిరించిన నేతగా ఉన్నారు. అయితే ఈయనకు ఇతర నేతల మద్దతు ఎంతవరకూ లభిస్తుందో తెలియదు అంటున్నారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి విషయం తీసుకుంటే ఈయన దూకుడు చూపించే నేతగా ఉంటారు. అయితే ఆయన అపుడపుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు అన్న పేరు ఉంది. మొత్తానికి కాంగ్రెస్ గెలిచేసింది. ఇపుడు అసలైన సమస్య హై కమాండ్ మీద ఉంది. ఎవరిని సీఎం ని చేసినా మిగిలిన వారిని కూడా ఒప్పించడం పెద్ద సమస్యగానే ఉంటుంది.
ఇక రేవంత్ రెడ్డిని సీఎం ని చేస్తే చాలా మంది కంటే ఆయన జనాలకు తెలుసు. పైగా కేసీయార్ మీద పోరాడిన మొనగాడిగా ఉంటారు కాంగ్రెస్ జోరు కూడా మరింత పెరుగుతుంది అన్న భావన ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.