పోలీస్ డిపార్ట్ మెంట్ లో టెన్షన్... తెలంగాణ డీసీపీ ఫోన్ హ్యాక్?
తెలంగాణలో ఊహించని పరిణామం జరిగిందని తెలుస్తుంది. తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఒక ఫోన్ హ్యాకింగ్ వార్త కలకలం సృష్టించిందని అంటున్నారు.
By: Tupaki Desk | 15 Oct 2023 6:59 PM GMTతెలంగాణలో ఊహించని పరిణామం జరిగిందని తెలుస్తుంది. తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఒక ఫోన్ హ్యాకింగ్ వార్త కలకలం సృష్టించిందని అంటున్నారు. ఏకంగా డీసీపీ స్థాయి పోలీసు ఉన్నతాధికారి ఫోన్ హ్యాకింగ్ కు గురి అయ్యిందని కథనాలొస్తున్నాయి. ప్రముఖ తెలుగు దినపత్రికకు సంబంధించిన అంతర్జాల స్థలంలో ఈ మేరకు ఒక వార్త హల్ చల్ చేస్తుంది.
అవును... తెలంగాణలో పోలీసు ఉన్నతాధికారి ఫోన్ హ్యాకింగ్ కు గురి కావడం కలకలం సృష్టించిందని తెలుస్తుంది. ఇదే సమయంలో... రాబోయే రోజుల్లో మరికొందరు పోలీసుల ఫోన్లను కూడా హ్యాక్ చేసి సమాచారం బయటకు తీస్తామని హ్యాకర్ల నుండి హెచ్చరికలు కూడా అందాయని ఆ వార్తా కథనం పేర్కొంది.
వివరాళ్లోకి వెళ్తే... తెలంగాణలో ఎన్నికల సమయం కావడంతో పోలీసు యంత్రాంగం నిత్యం తనిఖీలు, బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కోట్ల రూపాయల డబ్బు, కిలోల కొద్దీ వెండి బంగారం సీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... సైబరాబాద్ పరిధిలోని ఒక డీసీపీ ఫోన్ హ్యాక్ అయ్యిందని ఆ కథనంలో పేర్కొన్నారు.
శనివారం ఉదయం నుంచి విధి నిర్వహణలో నిమగ్నమైన ఆ డీసీపీ ఫోన్ మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా హ్యాకింగ్ కు గురైనట్టు గుర్తించారట. దీంతో దాదాపు 2 గంటల సమయంలో ఫోన్ పూర్తిగా అవతలి వారి చేతిలోకి చేరినట్టు నిర్ధారించారట. దీంతో అలర్ట్ అయిన సైబర్ నిపుణులు డీసీపీ ఫోన్ ను సాధారణ స్థితికి తీసుకొచ్చారట.
ఇది నిజంగా హ్యాకర్లే చేశారా.. లేక, ఎవరైనా తెలిసినవారు చేశారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రానప్పటికీ... ఒక డీసీపీ స్థాయి అధికారి ఫోన్ హ్యాక్ చేయటన్ని మాత్రం పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారని చెబుతున్నరట. ఈ సమయంలో ఈ హ్యాకింగ్ కారణాలపై ఈ కథనంలో ఒక ఊహాగాణాన్ని పొందుపరచడం గమనార్హం.
ఇందులో భాగంగా... సిటీలో ఇటీవల ఒక ఐటీ ఉద్యోగిపై సదరు డీసీపీ చేయిచేసుకున్నారంట. దీంతో... ఐటీ నిపుణులు ఫోన్ హ్యాక్ చేశారని సమాచారం అని ఆ కథనం పేర్కొంది. ఇదే సమయంలో వారు ఫోన్ లోని వ్యక్తిగత వీడియోలు బయటపెట్టినట్టు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినట్టు తెలుస్తోందని పేర్కొంది.
ఇదే సమయంలో రాబోయే రోజుల్లో మరికొందరి పోలీసుల సమాచారం కూడా ఇదే విధంగా వెలికితీస్తామంటూ తమ పోస్టు ద్వారా హెచ్చరించారని పేర్కొంది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. సదరు హ్యాకర్ కోసం గాలిస్తున్నారని ఆ కథనం వెల్లడించింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.