Begin typing your search above and press return to search.

మోతెక్కిపోనున్న తెలంగాణా

ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నది కదా అన్నీ పార్టీలు కలిసి తెలంగాణాను మోతెక్కించేసేందుకు రెడీ అవుతున్నాయి

By:  Tupaki Desk   |   5 Sep 2023 6:34 AM GMT
మోతెక్కిపోనున్న తెలంగాణా
X

ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నది కదా అన్నీ పార్టీలు కలిసి తెలంగాణాను మోతెక్కించేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఈనెల 17వ తేదీ తెలంగాణా విమోచన దినోత్సవమని అందరికీ తెలిసిందే. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సమయంలో తెలంగాణా విమోచన దినోత్సవానికి బాగా ప్రాధాన్యత పెరిగిపోయింది. ఎన్నికలు మరో నాలుగు నెలల్లోకి వచ్చేసింది కాబట్టి అన్నీ పార్టీలు పోటీలు పడి తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరపాలని డిసైడ్ అయ్యాయి.

కాంగ్రెస్ తరపున అగ్రనేతలను వీలుంటే సోనియాగాంధీని పిలిపించేందుకు పీసీసీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణా విమోచన దినోత్సవం సభలో సోనియాగాంధితో ప్రత్యేక తెలంగాణా ఇచ్చిన విషయాన్ని ప్రకటించేట్లుగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. తెలంగాణాను ఇచ్చింది కాంగ్రెస్ తెచ్చిందీ కాంగ్రెస్ మాత్రమే అన్నట్లుగా సోనియాతో ప్రకటన చేయించాలని అనుకుంటున్నారు. సోనియా ప్రకటనతో తెలంగాణాలో కాంగ్రెస్ పుంజుకుంటుందని, కేసీయార్ ను జనాలు దూరంపెడతారని కాంగ్రెస్ నమ్ముతోంది.

ఇదే సమయంలో బీజేపీ కూడా విమోచన దినోత్సవాన్ని పెద్దఎత్తున జరపాలని డిసైడ్ అయ్యింది. ఇందుకోసమని ప్రత్యేకంగా వరంగల్లో పెద్ద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. భారీ బహిరంగసభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను పిలిపించాలని కూడా డిసైడ్ అయ్యింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు. మరి రెండుపార్టీలు చేస్తున్న ఏర్పాట్లను చూసిన తర్వాత కేసీయార్ ఊరుకోరు కదా.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని ఎలా జరపాలనే విషయమై ఆలోచన మొదలుపెట్టారు. మంత్రులు, పార్టీలోని సీనియర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. అధికారంలో ఉందికాబట్టి కేసీయార్ తలచుకుంటే ఏర్పాట్లు ఎంత ఘనంగా అయినా చేయగలరు. కాబట్టి మూడుపార్టీలు తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఎంత వీలుంటే అంత ఘనంగా జరపాలని డిసైడ్ అయి ఏర్పాట్లలో ముణిగిపోయాయి. అందుకనే రాబోయే తెలంగాణా విమోచన దినోత్సవం నాడు తెలంగాణాలో మోతెక్కిపోబోతోంది. మరి మూడు పార్టీలు నిర్వహించబోయే కార్యక్రమాలను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ? ఎవరిని ఆధరిస్తారో చూడాల్సిందే.