Begin typing your search above and press return to search.

మోడీ 10...రాహుల్ 26... లెక్క పెర్ ఫెక్ట్ ...!

తెలంగాణా ఎన్నికలకు కేవలం ఒక రోజు మాత్రమే టైం ఉంది. ఈసారి ఎన్నికల ప్రచారం చాలా జోరుగా సాగింది

By:  Tupaki Desk   |   28 Nov 2023 4:45 PM GMT
మోడీ 10...రాహుల్ 26... లెక్క పెర్ ఫెక్ట్ ...!
X

తెలంగాణా ఎన్నికలకు కేవలం ఒక రోజు మాత్రమే టైం ఉంది. ఈసారి ఎన్నికల ప్రచారం చాలా జోరుగా సాగింది. రెండు జాతీయ పార్టీలు తెలంగాణా వేదికగా కదం తొక్కాయి. అధికార బీజేపీ తెలంగాణా రాజకీయాల్లో తమ పాత్రను భారీ ఎత్తున పెంచుకోవాలని చూసింది. కాంగ్రెస్ అయితే ఈసారి జాతకాన్ని మార్చాలని పట్టుదలగా దూకింది.

ఈ నేపధ్యంలో బీజేపీ అయితే ప్రతిష్టగా తీసుకుని ప్రచారాన్ని హోరెత్తించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా సభలు ర్యాలీలతో కలిపి పది దాకా చేపట్టారు. దాదాపుగా కీలకమైన జిల్లాలలో మోడీ టూర్ సాగింది. ఆయన తరువాత చూస్తే కేంద్ర హోం మంత్రి బీజేపీ అగ్ర నేత అమిత్ షా 22 దాకా సభలు ర్యాలీలు నిర్వహించారు. ఆయన కూడా మోడీ కవర్ చేయని జిల్లాలను నియోజకవర్గాలను కలియతిరిగారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఇద్దరు అగ్ర నేతలూ జనాలకు వివరించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల కలిగే లాభం ఏంటి అన్నది కూడా జనాలకు తెలియచెప్పే ప్రయత్నం చేశారు.

బీసీ సీఎం అంటూ ఒక స్టాండ్ తీసుకున్నారు. అలాగే మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని కూడా ప్రకటించడం మరో వ్యూహం. కాంగ్రెస్ విషయానికి వస్తే రాహుల్ గాంధీ ఇరవై ఆరు సభలు ర్యాలీలు నిర్వహించారు. ఆయన కూడా దాదాపుగా తెలంగాణా మొత్తం కవర్ అయ్యేలా చూసుకున్నారు

అతి ముఖ్యమైన జిల్లాలను రాహుల్ టచ్ చేయడం కూడా జరిగింది. ఆయన గారి చెల్లెలు, కాంగ్రెస్ లో అగ్ర నేత అయిన ప్రియాంకా గాంధీ కూడా 25 దాకా సభలు రోడ్ షోలలో పాల్గొని అన్నకు ధీటుగా నిలిచారు. ఆమె చాలా స్పష్టంగా సూటిగా జనాలకు అర్ధమయ్యేలా కాంగ్రెస్ గురించి చెబుతూ ప్రచారం చేశారు.

వీరి తరువాత కాంగ్రెస్ నుంచి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పది సభలు ర్యాలీలలో పాల్గొన్నారు. ఖర్గే కూడా అర్ధవంతమైన స్పీచ్ ఇచ్చారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు మొత్తంగా 64 కీలక అంశాలతో కూడిన మ్యానిఫేస్టోతో జనాలకు దగ్గర అయ్యేలా చూసుకుంది.

కాంగ్రెస్ గెలుస్తుంది అన్న భావనను తీసుకుని రావడంతో అగ్ర నేతల ప్రచారం హై కమాండ్ వ్యూహాలు బాగా పనిచేశాయి. కాంగ్రెస్ కి పొరుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, కీలక నేతలు కూడా వచ్చి ప్రచారం చేశారు. బీజేపీ కూడా అసోం, యూపీ నుంచి కూడా సీఎమల్ను తెచ్చి ప్రచారం చేయించించుకుంది.

ఇలా తెలంగాణా ఎన్నికలు అంటే కేంద్రంలో వచ్చే ఎన్నికలో అధికారం కోసం పోటీ పడుతున్న రెండు జాతీయ పార్టీలూ మోహరించి ప్రచారం చేయడమే విశేషం. ఒక విధంగా రాహుల్ వర్సెస్ మోడీ అన్నట్లుగా కూడా ప్రచారం చేశారు. బీయారెస్ కూడా జాతీయ పార్టీగా రూపాంతరం చెందినా కేసీయార్ మాత్రం జాతీయ పార్టీలు తెలంగాణాకు ఏమీ చేయలేవు అంటూ తమది ఇంకా ప్రాంతీయ పార్టీ అన్నట్లుగానే భావన వచ్చేలా మాట్లాడారు. హోరా హోరీ ప్రచారం చేసి ఓటర్లకు అంతా నిర్ణయాన్ని వదిలిపెట్టేశారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.