Begin typing your search above and press return to search.

చిహ్నంలో వీటికే చోటు.. తెలంగాణ రాజముద్ర ఫైనల్?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అధికారిక పేర్లు, చిహ్నల విషయంలో కీలక మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   30 May 2024 7:36 AM GMT
చిహ్నంలో వీటికే చోటు.. తెలంగాణ రాజముద్ర ఫైనల్?
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అధికారిక పేర్లు, చిహ్నల విషయంలో కీలక మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా... రాష్ట్ర చిహ్నంలో రాజచిహ్నాలు ఉండకూడదని ఆదేశించిన ఆయనకు... పెయింటర్ రుద్ర రాజేష్ అనేక నమూనాలను సమర్పించారు. ఈ సమయంలో ఒక ఫోటో వైరల్ గా మారింది.

తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నాన్ని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కారు రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాజముద్రకు సంబంధించి ఇప్పటికే మూడు లోగోలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ మూడింటిలో ఒక చిహ్నాన్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

అవును... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో విడుదల చేసే కొత్త రాజముద్ర ఇదే అంటూ ఓ ఫోటో వైరల్ అవుతుంది. ఇందులో భారత జాతీయ చిహ్నం.. అమరవీరుల స్థూపం.. వరి కంకులు.. ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో రాసి ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది!

ఇలా తెలంగాణ రాజముద్రను మార్చాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంపై బీఆరెస్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తెలంగాణ చిహ్నం మార్పుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ చార్మినార్‌ దగ్గర జరిగిన నిరసనలో బీఆరెస్స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తెలంగాణ రాష్ట్ర చిహ్నంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని.. ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను మారుస్తోందని.. కేసీఆర్‌ పేరు వినిపించకూడదనే ఆలోచనతో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అసలు.. తెలంగాణ చారిత్రక కట్టడాలైన చార్మినార్‌, కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు!