నిధులు తెచ్చుడో .. క్యాబినెట్ చచ్చుడో !
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సవాల్ కీలకంగా మారింది
By: Tupaki Desk | 24 July 2024 11:53 AM GMTకేంద్రప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ - బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటా పోటీ చర్చ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సవాల్ కీలకంగా మారింది.
‘కేంద్రం నుండి నిధులు సాధించడానికి ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద మంత్రి వర్గంతో ఆమరణ దీక్షకు కూర్చోవాలి.. వాళ్ల చుట్టు మేము కూర్చుని అండగా ఉంటాము. కేంద్రంతో కొట్లాడుదాం.. అందరం పోయి కూర్చుందాం అంతు చూద్దాం .. నిధులు తీసుకోద్దాం. నిధులు తెచ్చుడో. క్యాబినెట్ చచ్చుడో’ తేల్చుకుందాం అని కేటీఆర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల చూస్తే సంతోషంగా ఉందని, ఇటీవల రుణమాఫీ గురించి అడిగితే హరీష్ రావును, నిరుద్యోగుల గురించి అడిగితే నన్ను ఆమరణ దీక్ష చేయాలని సీఎం రేవంత్ అన్నాడని, అలాగే రాష్ట్రానికి నిధుల కోసం సీఎంతో పాటు క్యాబినెట్ ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆమరణదీక్ష చేయాలని అన్నారు.
దీనిపై స్పందించిన రేవంత్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ దీక్షకు వస్తే నేను దీక్షకు సిద్దమని, నిధులు వచ్చే వరకు దీక్ష చేద్దామని, తేది నిర్ణయిస్తే నేను వస్తానని రేవంత్ బదులివ్వడం విశేషం.