విడాకుల కేసులో భార్య ప్రియుడు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఈ సమయంలో తెలంగాణ హైకోర్టు ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసింది. ఇందులో భాగంగా... వివాహం రద్దు కోరుతూ భార్త దాఖలు చేసిన విడాకుల కేసులో.. భార్య ప్రియుడిని ప్రతివాదిగా చేర్చాలని హైక్రోటు తీర్పు వెలువరించింది.
By: Tupaki Desk | 23 Jun 2024 4:14 AM GMTఇటీవల కాలంలో మెజారిటీ విడాకుల కేసులకు వివాహేతర సంబంధాలే కారణం అనే కామెంట్లు తరచూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కారణాలు ఏవైనా.. పరిస్థితులు మరేవైనా.. పెళ్లైన కొంత కాలానికే భార్యా భర్తల మధ్య మనస్పర్థలు రావడం.. ఈ గ్యాప్ లో మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయనే మాటలు వినిపిస్తున్నాయి!
అవును... ఇటీవల కాలంలో మెజారిటీ విడాకులకు పైకి చెప్పుకున్నా, చెప్పుకోకున్నా వివాహేతర సంబంధాలు ఒక ప్రధాన కారణమనే మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భార్యభర్తల మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్థలను క్యాష్ చేసుకుంటూ మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడం.. ఫలితంగా పచ్చని సంసారంలో చిచ్చు మొదలవ్వడం ఇటీవల ఎక్కువగా ఉన్నాయనే మాటలు వినిపిస్తుంటాయి.
ఈ సమయంలో తెలంగాణ హైకోర్టు ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసింది. ఇందులో భాగంగా... వివాహం రద్దు కోరుతూ భార్త దాఖలు చేసిన విడాకుల కేసులో.. భార్య ప్రియుడిని ప్రతివాదిగా చేర్చాలని హైక్రోటు తీర్పు వెలువరించింది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ విడాకులు కోరుతున్నప్పుడు.. ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కూడా వివరణ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడింది.
వాస్తవానికి విడాకుల కేసులో భార్య ప్రియుడినీ ప్రతివాదిగ చేర్చాలన్న అభ్యర్థనను ఫ్యామిలీ కొర్టు తిరస్కరించింది. దీంతో... ఈ తిరస్కరణను సవాలు చేస్తూ హైదరాబాద్ కు చెందిన పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన పిటిషనర్ తరుపు న్యాయవాది... ప్రియుడి భార్య కూడా పిటిషనర్ భార్యకు తన భర్తతో వివాహేతర సంబంధం ఉందంటూ కోర్టుకు అఫిడవిట్ సమర్పించిందని అన్నారు.
ఈ నేపథ్యంలో... ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా పిటిషనర్ దరఖాస్తును తిరస్కరించడం చట్టవిరుద్ధమని న్యాయమూర్తి పేర్కొన్నారు.. అనంతరం ఫ్యామిలీకోర్టు ఉత్తర్వ్యులను రద్దుచేశారు. ప్రియుడిని ప్రతివాదిగా చేర్చిన తర్వాత విడాకుల కేసు విచారణ చేపట్టాలని ఆదేశించారు.