Begin typing your search above and press return to search.

అదరగొట్టేసిన రేవంత్!

ఇందులో భాగంగా... తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్ వెర్క్స్ భారీ పెట్టుబడులకు సిద్ధపడింది

By:  Tupaki Desk   |   18 Jan 2024 5:12 AM GMT
అదరగొట్టేసిన రేవంత్!
X

దావోస్‌ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని పలు ప్రతిష్టాత్మక కంపెనీల పెద్దలతో చర్చలు జరుపుతూ బిజీగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... తాజాగా కీలక ఒప్పందాలు కుదిర్చారు. ఇందులో భాగంగా... తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్ వెర్క్స్ భారీ పెట్టుబడులకు సిద్ధపడింది. ఈ సందర్భంగా వెబ్ వెర్క్స్ ప్రతినిధులు కీలక విషయాలు వెల్లడించారు.

అవును... దావోస్‌ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా... డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటెన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్క్స్ తో ఒప్పందం కుదిర్చారు. దీంతో తెలంగాణలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సిద్ధమైందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... దావోస్‌ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి.. ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. దీంతో... రూ.5200 పెట్టుబడులకు వెబ్ వెర్క్స్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

వాస్తవానికి హైదరాబాద్‌ లో 10 మెగావాట్ల నెట్‌ వర్కింగ్ హెవీ డేటా సెంటర్‌ లో ఇప్పటికే ఈ కంపెనీ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతోండగా... దీనికి అదనంగా మరో రూ. 4,000 కోట్లకు పైగా పెట్టుబడులతో గ్రీన్‌ ఫీల్డ్ హైపర్‌ స్కేల్ డేటా సెంటర్‌ విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు.

ఈ సందర్భంగా... దేశంలోనే డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ అసలైన గమ్యస్థానంగా నిలుస్తుందని.. పెట్టుబడిదారులు అందుకు అవసరమైన విద్యుత్తును కూడా పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నారని తెలిపారు. ఇదంతా తమ కొత్త ప్రభుత్వం అనుసరించే ఫ్రెండ్లీ పాలసీపై వాళ్లకున్న నమ్మకాన్ని చాటి చెపుతోందని వెల్లడించారు.

ఇదే సమయంలో స్పందించిన ఐరన్ మౌంటైన్ సీఈవో... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయటం ఆనందంగా ఉందని అన్నారు. ఇందులో భాగంగా... ప్రపంచవ్యాప్తంగా తమ డేటా సెంటర్‌ లలో నూరుశాతం పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధనం రెండింటికి మద్దతు అందించటం ద్వారా పెట్టుబడులను ఆకర్షణీయంగా మార్చిందని తెలిపారు.