Begin typing your search above and press return to search.

ప్రభుత్వంపై రేణు దేశాయ్ సీరియస్, ఏకంగా కోర్టుకి..!

ప్రస్తుతం హైదరాబాద్ లో ఆక్వా మెరైన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Aug 2023 7:59 AM GMT
ప్రభుత్వంపై రేణు దేశాయ్ సీరియస్, ఏకంగా కోర్టుకి..!
X

రేణు దేశాయ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే, ఎక్కువగా సినిమాలు చేయలేదు కానీ, పవర్ స్టార్ పవన్ ని పెళ్లి చేసుకొని ఫేమస్ అయ్యారు. తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. రేణు సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. తనకు నచ్చిన విషయాలను, అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు.

అయితే, తాజాగా ఆమె కోర్టు మెట్లు ఎక్కారు. అది కూడా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్ లో ఆక్వా మెరైన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగినట్లు ఏర్పాట్లుకూడా చేస్తున్నారు. దీనిని ప్రస్తుతం రేణు దేశాయ్ వ్యతిరేకిస్తుండటం గమనార్హం.

నగర శివారులోని కొత్వాల్‌ గూడలో ఆక్వా మెరైన్ పార్క్, పక్షిశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఆక్వా మెరైన్ పార్క్ కోసం కృత్రిమ సరస్సును సృష్టించడం పర్యావరణానికి ప్రమాదం అని వెంటనే పార్క్ ఏర్పాటు చర్యలను నిలిపివేయాలని నటి, సోషల్ యాక్టివిస్ట్ రేణు దేశాయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రేణు దేశాయ్ తో పాటు, నటి శ్రీదివ్య, డైరెక్టర్ శశికిరణ్ తిక్కా, హీరోయిన్ సదా తో పలువురు సెలబ్రెటీలు కూడా ఈ పార్క్ పై అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనార్హం. వీరందరూ కలిసే జూన్ 27న కోర్టులో పిటిషన్ వేశారు.

ఇక, వీరు వేసిన పిటిన్ ని న్యాయస్థానం అంగీకరించింది. వీరి పిటిషన్ ని పరిశీలించిన న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ ఎన్. తుకారామ్ జి.. ఇలాంటి పార్కుల నిర్మాణం సింగపూర్, మలేషియా లాంటి దేశాలలో జరిగింది. మన దేశంలో ఎందుకు జరగకూడదు అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. మరి ఈ పిటిషన్ విషయంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.