Begin typing your search above and press return to search.

కొత్త పీసీసీ చీఫ్... రేవంత్ ముందున్న ఆప్షన్స్ వీరేనా?

అవును... పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మూడేళ్ల పదవీకాలం ముగిసింది! కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనల ప్రకరం ప్రతీ 3 సంవత్సరాలకూ పీసీసీ చీఫ్ పదవీ కాలం ముగుస్తుంది..

By:  Tupaki Desk   |   28 Jun 2024 7:37 AM GMT
కొత్త పీసీసీ చీఫ్... రేవంత్  ముందున్న ఆప్షన్స్  వీరేనా?
X

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఎంపికపై అధిష్టానం కసరత్తులు పూర్తి చేసిందై తెలుస్తుంది. ఈ సందర్భంగా ముఖ్య నాయకులంతా అందుబాటులో ఉండాలని ఏఐసీసీ ఆదేశించిందని అంటున్నారు. ఈ సమయంలో అధిష్టాణం ముందు రేవంత్ ఆరు ఆప్షన్స్ పెట్టినట్లు చెబుతున్నారు.

అవును... పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మూడేళ్ల పదవీకాలం ముగిసింది! కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనల ప్రకరం ప్రతీ 3 సంవత్సరాలకూ పీసీసీ చీఫ్ పదవీ కాలం ముగుస్తుంది.. కొత్త వారి ఎంపిక ఉంటుంది! లేదా.. ఉన్నవారినే మరో మూడేళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం రేవంత్ సీఎంగా ఉండటంతో... పీసీసీ చీఫ్ బాధ్యతలు మరొకరికి అప్పగించనున్నారు!

ఈ సమయంలో ఆరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయని అంటున్నారు. వాస్తవానికి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ వస్తారనే చాలా మంది ఊహించారు. అయితే లోక్ సభ ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత ఈ ఎంపిక చేయాలని.. అప్పటివరకూ తానే కంటిన్యూ అవ్వాలని రేవంత్ భావించినట్లు చెబుతుంటారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు కూడా పూర్తవ్వడంతో పీసీసీ చీఫ్ ఎంపిక అనివార్యం అని అంటున్నారు.

ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త బాస్ గా బీసీ లేదా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతను ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు కూడా ఇతర సామాజికవర్గాల నుంచి పీసీసీ చీఫ్ ఆశావహుల్లో ఉన్నారని అంటున్నారు. దీంతో... ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది.

ఇందులో ప్రధానంగా... ఎస్సీ సామాజికవర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ సామాజికవర్గం నుంచి సీతక్క, బలరాం నాయక్, బీసీ సామాజికవర్గం నుంచి మధుయాష్కి, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి! అయితే... రేవంత్ ఛాయిస్ లో మాత్రం అటు సంపత్, ఇటు సీతక్క ఉన్నారని అంటున్నారు. ప్రధానంగా గిరిజన మహిళకు పీసీసీ పగ్గాలు అప్పగించటం ద్వారా సానుకూలత మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా అని అంటున్నారు.

ఇదే సమయంలో... జాతీయ స్థాయి పోస్టులు సైతం తెలంగాణ నేతలకు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), జనరల్ సెక్రటరీ, సెక్రటరీ పోస్టులు టి.కాంగ్రెస్ నేతలకు దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యలో ఏ నిమిషమైనా... దీనికి సంబంధించిన అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.