Begin typing your search above and press return to search.

రాములమ్మకు ఎర్త్ పెడుతున్న జీవిత... ఆ నియోజకవర్గంపై కర్చీఫ్?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మూడు ప్రధాన పార్టీలూ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 Sep 2023 10:51 AM GMT
రాములమ్మకు ఎర్త్ పెడుతున్న జీవిత... ఆ నియోజకవర్గంపై కర్చీఫ్?
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మూడు ప్రధాన పార్టీలూ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే బీఆరెస్స్ 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా... కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులనుంచి ధరఖాస్తులు స్వీకరించింది. ప్రస్తుతం స్కూటినింగ్ పనులు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో బీజేపీ సీటు కోసం ధరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్న జీవితా రాజశేఖర్ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే జీవిత ఇప్పటికే ప‌లు పార్టీలు మారారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల్లో.. ఈమె త‌న భ‌ర్త రాజ‌శేఖ‌ర్ తో క‌లిసి చేరారు. అయితే ఎక్కడా వీరికి రాజ‌కీయ ప్రాధాన్యత అయితే ల‌భించ‌లేదు. ఈ సమయంలో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని భావిస్తున్నారని తెలుస్తుంది.

ఈ సమయంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా... అధిష్టాణానికి దరఖాస్తు చేసుకున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి కమలం గుర్తుపై పోటీ చేయాలని జీవితా రాజశేఖర్ ఆశిస్తున్నారని సమాచారం.

అయితే ఈ కూకట్ పల్లి బీజేపీ టిక్కెట్ కోసం విజయశాంతి కూడా ఆశిస్తున్నారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె ఈ సారి కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు చెబుతూ.. అందుకే తనపై బీఆరెస్స్ నేతలు కూకట్ పల్లిలో అక్రమ కేసులు పెడుతున్నారని కథనాలొచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా సినిమా రంగానికే చెందిన జీవితా రాజశేఖర్ కూడా కూకట్ పల్లి సీటు కోసం దరఖాస్తు చేస్తుకున్నారంటూ వార్తలొస్తున్నాయి.

అయితే జీవితా రాజశేఖర్ కేవలం కూకట్ పల్లి నియోజకవర్గం ఒక్కస్థానానికే కాకుండా సికింద్రాబాద్, స‌న‌త‌న్ న‌గ‌ర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు కూడా దరఖాస్తు చేసుకున్నారని చెబుతున్నారు. ఇందులో ఫస్ట్ ప్లేస్ మాత్రం కూకట్ పల్లి ఇవ్వాలని, కానిపక్షంలో ఈ మూడు స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని కేటాయించాలని అప్లై చేశారని తెలుస్తుంది. మరి ఈ విషయంపై అధిష్టాణం ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి!