Begin typing your search above and press return to search.

అసలుసిసలు అస్త్రాలు బయటకు తీయలేదట

మరో వారంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న సంగతి తెలిసిందే. దీంతో.. రాజకీయ పార్టీలన్నీ ఒక రేంజ్ లో కసరత్తు చేస్తున్నాయి

By:  Tupaki Desk   |   3 Oct 2023 4:35 AM GMT
అసలుసిసలు అస్త్రాలు బయటకు తీయలేదట
X

మరో వారంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న సంగతి తెలిసిందే. దీంతో.. రాజకీయ పార్టీలన్నీ ఒక రేంజ్ లో కసరత్తు చేస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని నిలుపుకోవాలన్న తలంపుతో.. విపరీతమైన ప్రయాణాలు చేస్తూ.. వరుస ఓపెనింగులతో అదరగొట్టేస్తున్నారు. తాను పాల్గొనే ప్రతి ప్రోగ్రాంలోనూ విపక్షాలపై విరుచుకుపడుతూ.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు చేరవేసేందుకు వీలుగా పెద్ద ఎత్తున ప్లానింగ్ చేసుకోవటం కనిపిస్తోంది.

అయితే.. గడిచిన రెండు నెలలుగా తెలంగాణ అధికారపక్షం కాస్తంత డల్ గా కనిపిస్తుందన్న మాటల జోరు అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో.. మొన్నటి వరకు పెద్దగా అంచనాలు లేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన సత్తా చాటేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసిందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు ఎవరికి వారు చేయించుకుంటున్న సర్వే రిపోర్టుల్లోనూ కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్నది అధికారపక్షానికి జీర్ణించుకోలేనిదిగా మారింది. అయితే.. ఇదంతా తాత్కాలికమేనంటూ నమ్మకంగా చెబుతున్నారు గులాబీ నేతలు.

ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆరు పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని.. అధికార బీఆర్ఎస్ చేతులు ఎత్తేసినట్లుగా ప్రచారం జరుగుతున్నా.. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తున్నారు. తాము ఇప్పటివరకు ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్న అస్త్రాల్ని బయటకు తీసింది లేదని.. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీస్తామని.. అప్పుడు ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలంటూ గులాబీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు.

వారి వద్ద ఉన్న అస్త్రాలు ఏమిటన్న దానిపై క్లారిటీ ఇవ్వనప్పటికీ.. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన ఆరు వరాలకు మించి మెరుగైన వరాలు తాము ఇస్తామని గులాబీ నేతల నోట వినిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత.. తమ వద్ద సిద్ధం చేసిన ఒక్కో అస్త్రాన్ని బయటకు తీయనున్నట్లుగా తెలుస్తోంది. అస్త్రాలు రెఢీ.. అదరగొట్టేయటం పక్కా అంటున్న గులాబీ నేతలు కాన్ఫిడెన్సు ఎంతవరకు కరెక్టు అన్నది రానున్న రోజులు స్పష్టం చేస్తాయని చెప్పక తప్పదు.