Begin typing your search above and press return to search.

ఎంకి పెళ్లి సుబ్బి చావు... తెలంగాణలో అభ్యర్థులకు కొత్త టెన్షన్!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నెల అయిన నవంబర్ లో 15, 19, 21, 22, 23, 24, 26, 29 తేదీలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 3:59 AM GMT
ఎంకి పెళ్లి సుబ్బి చావు... తెలంగాణలో అభ్యర్థులకు కొత్త టెన్షన్!
X

దేశవ్యాప్తంగా ఐదురాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఛత్తీస్‌ గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ లో జరగనున్నాయి. వీటికోసం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంటూ పగడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సమయంలో ఈ ఏడాది ఎన్నికలకు పెళ్లిళ్ల ముహూర్తాలతో పెద్ద చిక్కొచ్చి పడిందని తెలుస్తుంది. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు!

అవును... నవంబర్ నెలలో ప్రతీరాష్ట్రంలోనూ సుమారు లక్షలాది పెళ్లిళ్లు జరగనున్నాయని అంటున్నారు. ఈ సమయంలో రాజస్థాన్ నవంబర్ 23 ఒక్కరోజే సుమారు 50,000 కు పైగా పెళ్లిళ్లు ఉన్నాయని తెలిసింది. దీంతో ఆ ముహూర్తం ఎఫెక్ట్ రాష్ట్ర ఎన్నికలపై పడనుందని ఎన్నికల కమిషన్ భావించింది. దీంతో ఆ రోజు జరగాల్సిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను 25కు పోస్ట్ పోన్ చేసింది. ఈ క్రమంలో తెలంగాణలోనూ ముహూర్తాల ఎఫెక్ట్ అభ్యర్థులను టెన్షన్ పెడుతుందని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నెల అయిన నవంబర్ లో 15, 19, 21, 22, 23, 24, 26, 29 తేదీలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... నవంబర్ 30వ తేదీన జరిగే పోలింగ్ పై ఈ పెళ్లిళ్ల ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో అని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెళ్లిళ్ల హడావిడి తమ గెలుపుపై ఏమేరకు ప్రభావం చూపింస్తుందనే టెన్షన్ పట్టుకుందని చెబుతున్నారు.

దీంతో ప్రచార కార్యక్రమాల స్టైల్ మార్చబోతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... తమ తమ నియోజకవర్గాల్లోని గ్రామాల వారీగా ఎక్కడెక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయనే విషయం తెలుసుకుని నోట్ చేసి పెట్టుకుంటున్నారంట అభ్యర్థులు. ఈసారి త్రిముఖ పోటీ ఖాయమని చెబుతున్న తరుణంలో ప్రతి ఓటు కీలకమని భావిస్తున్న నేపథ్యంలో... పెళ్లి మండపాలలోకి వెళ్లి మరీ ప్రచారం చేయాలనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది.

ఆయా వివాహ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగానో, ప్రత్యేక అతిధిగానో వెళ్లడం.. అక్కడ తన స్టైల్లో ప్రచారం చేసుకోవడం.. అవసరమైతే ఉచిత కల్యాణమండపం హామీ ఒకటి ఇచ్చేయడం వంటివి చేసే దిశగా నేతలు ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ఆ నియోజైకవర్గంలో జరిగే ప్రతీ పెళ్లికీ ఆహ్వానం అందేవిధంగా కార్యకర్తలను అలర్ట్ చేశారని చెబుతున్నారు! దీంతో... ఎంకి పెళ్లి సుబ్బి చావుకి రావడం అంటే ఇదేనేమో అనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం!

కాగా... తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాలతో హోరిత్తెంచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార బీఆరెస్స్ అధినేత కేసీఆర్ రోజుకి మూడు నియోజకవర్గాల్లో సభలు పెడుతూ సుడిగాలి పర్యటన చేస్తుండగా.. పక్క రాష్ట్రాల నుంచి సైతం పార్టీలో కీలక నేతలను రంగంలోకి దింపి కాంగ్రెస్ ప్రచారాలు చేస్తుంది. మరోపక్క బీజేపీ.. జనసేనతో పొత్తుపెట్టుకుని సీట్ల సర్ధుబాటు పనుల్లో బిజీగా ఉందని తెలుస్తుంది.