Begin typing your search above and press return to search.

టెలిగ్రామ్ సీఈవో చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. తెరపైకి అశ్లీల కంటెంట్!

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ తర్వాత ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ గా పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Aug 2024 2:30 PM GMT
టెలిగ్రామ్  సీఈవో చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. తెరపైకి అశ్లీల కంటెంట్!
X

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ తర్వాత ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ గా పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ మెసేజింగ్ యాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పావెల్ దురోవ్ అరెస్ట్ అవ్వడం తీవ్ర కలకలం రేపీంది. ఈ సమయంలో అతని చుట్టూ ఉచ్చు బిగుస్తోందని అంటున్నారు.

అవును... ప్రముఖ మెసేజింగ్ యప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందని అంటున్నారు. చైల్డ్ పో*ర్నోగ్రఫీ, డ్రగ్స్ అక్రమ రవాణా సహా పలు చట్టవిరుద్ధ కార్యకలాపాల వ్యాప్తిని అరికట్టడంలో ఆతడు ఘోరంగా విఫలమయ్యారని ప్యారిస్ కోర్టు ధృవీకరించింది! దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... టెలిగ్రామ్ యాప్ లో తీవ్ర అభ్యంతరకర కార్యకాలాపాలకు పాల్పడేందుకు అనుమతి ఇచ్చారంటూ ఇటీవల అభియోగాలు నమోదయ్యాయి. దీంతో.. ఆ సంస్థ సీఈవోపై కేసులు నమోదయ్యాయి! ఇదే సమయంలో... ఈ యాప్ లో పిల్లలపై అశ్లీల కంటెంట్ వ్యాప్తి చేశారనే ఆరోపణలకు గానూ అధికారులు కోరిన డాక్యుమెంట్లను సమర్పించేందుకు ఆయన నిరాకరించినట్లు చెబుతున్నారు.

ఈ మేరకు ప్యారిస్ ప్రాసిక్యూటర్లు ఈ విషయాలను వెల్లడించారు. దింతో.. కోర్టు అనుమతితో అతడిని ఫ్యాన్స్ అధికారులు విచారణ జరపనున్నారు. ఇది ప్రధానంగా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వ్యవహారం అని చెబుతుండటంతో పావెల్ దురోవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని అంటున్నారు.

కాగా... గత శనివారం సాయంత్రం అజర్ బైజాన్ నుంచి పారిస్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పావెల్ దురోవ్ ను అక్కడి అధికారులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. టెలిగ్రామ్ యాప్ ద్వారా హవాలా మోసం, డ్రగ్స్ అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం చేయడం వంటి అభియోగాలు ఆయనపై ఉన్నాయని అంటున్నారు.

మరోపక్క పావెల్ దురోవ్ అరెస్టుపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. వాక్ స్వాంతంత్ర్యంపై పశ్చిమ దేశాల ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనమని అ దేశం విమర్శిస్తుంది. ఇక... రష్యాలో జన్మించిన దురోవ్ ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నారు. 2021లో అతడు ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్నారు.