Begin typing your search above and press return to search.

షాకింగ్... టెలీగ్రామ్ లో భారత ఇన్స్యూరెన్స్ కంపెనీ కస్టమర్స్ డేటా!?

అవును... భారత్ లోని దిగ్గజ హెల్త్ ఇన్స్యూరెన్స్ సంస్థ అయిన "స్టార్ హెల్త్" కంపెనీ నుంచి పెద్ద సంఖ్యలో కస్టమర్ల డేటా చోరీకి గురైనట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   20 Sep 2024 8:30 PM GMT
షాకింగ్...  టెలీగ్రామ్  లో భారత ఇన్స్యూరెన్స్  కంపెనీ కస్టమర్స్  డేటా!?
X

టెలీగ్రామ్ యాప్ లో నేరాలకు అనుమతిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ ను పారిస్ పోలీసులు గత నెలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ సంస్థకు సంబంధించి మరో సంచలన ఆరోపణ తెరపైకి వచ్చింది. చాట్ బాట్స్ ద్వారా ఓ ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్ల డేటా అందుబాటులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అవును... భారత్ లోని దిగ్గజ హెల్త్ ఇన్స్యూరెన్స్ సంస్థ అయిన "స్టార్ హెల్త్" కంపెనీ నుంచి పెద్ద సంఖ్యలో కస్టమర్ల డేటా చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... లక్షలాది కస్టమర్ల ఇన్ఫర్మేషన్ ను ఓపెన్ గా విక్రయానికి పెట్టినట్లు కథనాలు వస్తున్నాయి. వీటిలో కస్టమర్ల హెల్త్ రిపోర్ట్స్ తో పాటు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందని అంటున్నారు.

అయితే ఈ సందర్భంగా టెలీగ్రామ్ టాపిక్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఆ యాప్ లోని చాట్ బాట్స్ ద్వారా ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని చాట్ బాట్ క్రియేటర్ ఓ సెక్యూరిటీ రీసెర్చర్ కు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు.

సదరు రీసెర్చర్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడని చెబుతున్నారు. దీంతో... చాట్ బాట్లను ఉపయోగించి హెల్త్ పాలసీ, క్లెయిమ్ డాక్యుమెంట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సదరు మీడియా సంస్థ తెలిపింది! ఇదే సమయంలో... కస్టమర్ల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలు, వారు చేయించుకున్న టెస్టుల ఫల్లితాల సమాచారాన్ని పొందవచ్చని తెలిపింది.

కాగా... గత నెలలో టెలీగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ ను పారిస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చీటింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, సైబర్ నేరాలతో పాటు వ్యవస్థీకృత నేరాలను ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.