Begin typing your search above and press return to search.

టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్ వెనుక అంత కథ ఉందా?

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఈ మెసేజింగ్ యాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పావెల్ దురోవ్ అరెస్ట్ అయ్యారు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 7:37 AM GMT
టెలిగ్రామ్  సీఈవో అరెస్ట్  వెనుక అంత కథ ఉందా?
X

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలీగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ తర్వాత ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ గా దీనికి పేరుంది. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఈ మెసేజింగ్ యాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పావెల్ దురోవ్ అరెస్ట్ అయ్యారు. పారిస్ లో ఉన్న బోర్గెడ్ విమానాశ్రయంలో పోలీసులు పావెల్ ను అదుపులోకి తీసుకున్నారు.

అవును... ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలీగ్రామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్ కు సంబంధించిన నేరాలకు సంబంధించి ఇతన్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతని అరెస్టుకు సంబంధించి కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. ఈ మేరకు పలు కథనాలు వైరల్ అవుతున్నాయి.

కథనాల ప్రకారం... పావెల్ ను టెలీగ్రామ్ యాప్ కు సంబంధించిన కేసులో అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. టెలీగ్రామ్ లో మొడరేటర్లు లేరన్న విషయంపైనే ఫ్రెంచ్ పోలీసులు తమ దర్యాప్తును కేంద్రీకరించినట్లు చెబుతున్నారు. ఇలా మోడరేటర్లు లేకపోవడం వల్ల మెసేజింగ్ యాప్ లో నేర కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉందని పోలీసులు నొక్కి చెబుతున్నారు.

మరోపక్క మోసం, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ అరెస్ట్ వ్యవహారంపై ఇప్పటివరకూ టెలీగ్రామ్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదని తెలుస్తోంది. ఇదే క్రమంలో... అటు పోలీసులు కూడా దీనికి సంబంధించి ఇప్పటివరకూ అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు.

కాగా... 2022లో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసినప్పటి నుంచీ యుద్ధం చుట్టూ నెలకొన్న రాజకీయాలకు సంబంధించి టెలీగ్రామ్ వేదికగా పెద్ద ఎత్తున ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక... ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ... తన అధికారులకు ఈ టెలీగ్రామ్ అత్యంత ప్రధానమైన కమ్యునికేషన్ మాద్యమమని చెబుతుంటారు.