ఓన్లీ వన్ వీక్...తెలుగు మీడియా ఓవర్ హీట్
ఇక మీడియాలో ఎక్కువగా హీటెక్కించే రంగాలు రెండే రెండు. ఒకటి సినిమా రెండు రాజకీయం. తెలుగు వారికి ఈ రెండూ ఆవకాయ, గోంగూర లాంటివి.
By: Tupaki Desk | 14 Dec 2024 2:05 PM GMTఒకే ఒక్క వారం తెలుగు మీడియాలో హీట్ పీక్స్ కి చేరిపోయింది. అదే పనిగా వార్తలు వరస సంఘటలతో మీడియాకి ఓవర్ ఫీడింగ్ అయిపోయింది. సాధారణంగా డిసెంబర్ నెల అంటే కొంత డ్రై గా సాగుతుంది. ఎందుకు అంటే కొత్త ఏడాది ముందు ఉండే స్తబ్దతతో పాటు ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్ని న్యూ ఇయర్ కే జరగడంతో కౌంట్ డౌన్ పొజిషన్ తప్ప పెద్దగా కరెంట్ డేస్ లో ఏమీ హాట్ టాపిక్స్ ఉండవు.
ఇక మీడియాలో ఎక్కువగా హీటెక్కించే రంగాలు రెండే రెండు. ఒకటి సినిమా రెండు రాజకీయం. తెలుగు వారికి ఈ రెండూ ఆవకాయ, గోంగూర లాంటివి. ఈ రెండూ లేకపోతే తెలుగు వారికి స్పైసీ ఫుడ్ లా న్యూస్ అందదు. దానిని అందించడం ఈ డ్రై మంత్ లో తెలుగు మీడియా పడే కష్టాలు చాలానే ఉంటాయి.
అలాంటిది ఏదీ లేకుండానే డిసెంబర్ నెలలో ఒక వారం మీడియాకే ఒవర్ డోస్ అన్నట్లుగా వరస సంఘటనలు వచ్చి పడ్డాయి. మీడియా వేయి కాళ్ళతో కోటి చేతులతో తన విశ్వ రూపం ఎంత చూపించినా తట్టుకోలేనంత న్యూస్ క్రౌడ్ తో దెబ్బకు వేసవి హీట్ తెచ్చేసింది.
అలా తెలుగు మీడియా స్పేస్ ని పూర్తిగా ఈ డిసెంబర్ నెల ఆక్రమించింది అని చెప్పాలి. ఒకదాని తర్వాత మరోటి ఇలా మీడియా ఫుల్ కవరేజ్ తో యమ బిజీని చూసింది. ఇయర్ ఎండింగ్ లో ఇంతలా ట్రెండింగ్ న్యూస్ తో తెలుగు మీడియా ఫుల్ బిజీ కావడం మాత్రం గతంలో ఎప్పుడూ జరగలేదు.
వాస్తవానికి చూస్తే మోస్ట్ ఎవైటింగ్ మూవీ పుష్ప రిలీజ్ తరువాత జరిగిన ఒక్కో ఘటనతో మీడియాకు ఫుల్ ప్యాక్డ్ న్యూస్ వచ్చేసింది. అల్లు అర్జున్ చిత్రం పుష్ప మీద వరస కవరేజ్ చేస్తూ మీడియా హైప్ ని క్రియేట్ చేస్తూ పోయింది. ఆ మూవీ కాస్తా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ ని క్రియేట్ చేసి భారీ కలెక్షన్లను సాధించింది.
ఇక ఆ హడావుడి అలా కంటిన్యూ అవుతూండగానే దీని తర్వాత డిసెంబర్ రెండవ వారం ప్రారంభంలో మంచు ఫ్యామిలీ భారీ ఎపిసోడ్ బిగ్ బాస్ రియాలిటీ షోస్ ని సైతం దాటి వెళ్ళిందని కూడా అంటున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు అతని ఇద్దరు కుమారులు విష్ణు మనోజ్ మధ్య మొదలైన కుటుంబ కలహాలతో కొన్ని రోజులు మీడియాకు అది మసాలా ఫుడ్ మాదిరిగా ఫుల్ కవరేజ్ న్యూస్ గా మారింది.
ఈ విధంగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వరుస ఘటనలను కవర్ చేయడంపై తెలుగు మీడియా దృష్టి సారిస్తుండగా ఓ మీడియా రిపోర్టర్‌పై మోహన్‌బాబు మైక్ ఊపుతూ వచ్చి ఆయనను గాయపర్చడంతో మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. దీంతో రిపోర్టర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందడంతో అది న్యూ టర్న్ తీసుకుంది.
ఆ విషయం అలా ఉండగా పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ సడెన్ అరెస్ట్ తో తెలుగు మీడియా మొత్తం షేక్ అయింది. అది బ్లాస్టింగ్ న్యూస్ గా మారి మీడియా హౌస్ లో ఒవర్ హీట్ నే రాజేసింది.ఇలా ఒక రోజంతా అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత విడుదల వంటి వాటితో తెలుగు మీడియా ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది ని చెప్పాలి.
అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మొదలైన బ్లాస్టింగ్ న్యూస్ కస్తా నాంపల్లి కోర్టు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పూర్తిగా ఓవర్‌డ్రైవ్‌లోకి వెళ్లింది. ఇక ఆ మీదట ట్విస్టుల మీద ట్విస్టులు సాగి అల్లు అర్జున్ చివరి క్షణంలో బెయిల్ పొందగలిగారు. అలా అల్లు అర్జున్‌కి మధ్యంతర బెయిల్ లభించడంతో అరెస్ట్ వ్యవహారం ప్రశాంతంగా ముగిసింది. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో క్షణ క్షణం వార్తలను కవర్ చేస్తూ కవర్ చేస్తూ తెలుగు మీడియాను ఓవర్‌డ్రైవ్‌లోకి వెళ్ళిపోయింది
సరే ఇంతటితో ఇది ఆగుతుందా అంటే అది కూడా కాదని అంటున్నారు వచ్చే వారానికి సరిపడా మరింత ఓవర్ లోడింగ్ న్యూస్ రెడీగా ఉందని ప్రచారం అయితే సాగుతోంది. అదేంటి అంటే తొందరలో సినీ హీరో మోహన్ బాబు, కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.
మీడియా సిబ్బందిపై దాడికి సంబంధించిన కేసులో మోహన్ బాబు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బీఆర్ఎస్ అగ్ర నేత కేటీఆర్ విషయానికొస్తే ఆయన ఫార్ములా ఇ కుంభకోణం కేసులో ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ గవర్నర్ అనుమతితో ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది.
దాంతో ఆయన అరెస్ట్ జరుగుతుంది అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా తెలుగు మీడియాకు మరింత హీటెక్కించే న్యూస్ తో కొత్త వారం మొదలవుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే కనుక ఇటీవలి సంవత్సరాలలో తెలుగు మీడియాకు ఇంత హెవీ లోడెడ్ న్యూస్ వరసగా దక్కించ సందర్భం అయితే లేదు.
కానీ ఇపుడు ఒకేసారి తుఫానులు సునామీలు అన్నీ కలసికట్టుగా వచ్చినట్లుగా పవర్ ఫుల్ లోడింగ్ న్యూస్ తో తెలుగు మీడియా ఫుల్ షేకింగ్ లో ఉంది. మరి రానున్న రోజులలో తెలుగు మీడియాని ఊపేసే ఘటనలు ఏ రూపంలో ముందుకు వస్తాయో అన్నది అంతా వెయిటింగ్ అన్న మాట.