తమ్ముళ్ల భయం: పవన్ డామినేషన్‌కు టీడీపీ దొరికి పోతుందా ..!
ఇక, ఇప్పుడు మరో వాదన తెరమీదికి వచ్చిం ది. అదే .. జనసేన దూకుడుతో టీడీపీ హైజాక్ అవుతోందన్నది తమ్ముళ్ల ఆవేదన.
By: Tupaki Desk | 20 Jan 2025 4:30 PM GMTరాష్ట్రంలో తమ్ముళ్ల మధ్య తీవ్ర ఆవేదన కనిపిస్తోంది. తమ పార్టీ డామినేషన్‌కు గురి అవుతోందన్న బాధ.. ఆందోళన కూడా వారు వెలిబుచ్చుతున్నారు. కొందరు నాయకులు నేరుగా బయట పడుతుంటే.. మరికొం దరు మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం.. పార్టీల మధ్య ఉన్న పోటీనే కారణమని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీ, జనసేన పార్టీలను గమనిస్తే.. పై స్థాయిలో పార్టీల అధినేతలు కలివిడిగానే ఉన్నారు.
అయితే.. క్షేత్రస్థాయిలోనే ఇంకా తరతమ బేధాలు కనిపిస్తున్నాయి. నాయకుల మధ్య కలివిడి కూడా లో పించింది. ఇది అంతిమంగా పార్టీపై ప్రభావం చూపిస్తోంది. ఇక, ఇప్పుడు మరో వాదన తెరమీదికి వచ్చిం ది. అదే .. జనసేన దూకుడుతో టీడీపీ హైజాక్ అవుతోందన్నది తమ్ముళ్ల ఆవేదన. పార్టీ పరంగా తాము బలంగానే ఉన్నామని తమ్ముళ్లు చెబుతున్నారు. రాజకీయంగా కూడా తాము ద్రుఢంగానే ఉన్నామని అంటున్నారు. కానీ, గ్రాఫ్‌విషయంలో మాత్రం ఎక్కడో తేడా కొడుతోందని చెబుతున్నారు.
దీనికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు కారణమని.. కొందరు నాయకులు భావి స్తున్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారం వచ్చినప్పుడు, విజయవాడ వరదలు, తిరుపతి తొక్కిసలాట సహా.. విజయవాడ కృష్ణానదిలో బోటు వ్యవహారం వంటివి తెరమీదికి వచ్చినప్పుడు.. పవన్ కల్యాణ్ స్పందించి న తీరు అందరికీ తెలిసిందే. ఆ స్పందనే ఇప్పుడు టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకులను ఇరకాటంలోకి నెట్టింది. అంత బలమైన గళం వినిపించడంలో తాము వెనుకబడ్డామా? అని వారు చర్చించుకుంటున్నా రు.
ఈ నేపథ్యంలోనే తమ పార్టీలోనూ ఇంత డామినేషన్ పాలిటిక్స్ కావాలని కోరుకుంటున్న వారు పెరుగుతు న్నారు. అయితే.. జిల్లాల వారిగా.. క్షేత్రస్థాయిలో చూసుకుంటే మాత్రం.. ఇప్పటికిప్పుడు టీడీపీకి వచ్చిన నష్టం కానీ.. పార్టీ ఇబ్బందులు పడుతుందన్న భావన కానీ ఎవరికీ లేదు. అయినప్పటికీ.. పవన్ తరహా డామినేషన్ రాజకీయాలు చేయడం కనుక పెరిగితే.. అప్పటికి తమ పార్టీ కూడా క్రియాశీలకంగా వ్యవహ రించాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా ఈ పరిణామం.. ఏపీ రాజకీయాల్లో చర్చగా మారింది.