నేటి నుంచి కొత్త మద్యం ధరలు... రూ.10, 15% పెంచిన తెలుగు రాష్ట్రాలు!
మందుబాబులకు రెండు తెలుగు రాష్ట్రాలు బిగ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... నేటి నుంచి మద్యం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
By: Tupaki Desk | 11 Feb 2025 7:38 AM GMTమందుబాబులకు రెండు తెలుగు రాష్ట్రాలు బిగ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... నేటి నుంచి మద్యం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఏపీలో క్వార్టర్ బాటిల్ పై రూ.10 చొప్పున పెరగగా.. తెలంగాణలో అన్ని రకాల బీర్లపైనా ధరలను 15% పెంచుతున్నట్లు వెల్లడించాయి. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపాయి.
అవును... ఆంధ్రప్రదేశ్ లో క్వార్టర్ రూ.99 మద్యం మినహా మిగతా అన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలను ప్రభుత్వం పెంచింది. ఫలితంగా.. క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిల్స్ పై ఇప్పటివరకూ ఉన్న ఎమ్మార్పీకి అదనంగా రూ.10 చొప్పున పెరగనుంది. అయితే.. బీర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. ఈ మేరకు అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ ను సవరించింది.
ఈ సందర్భంగా... మద్యం దుకాణాల లైసెన్సుదారులకు రిటైలర్ మర్జిన్ ను ఇష్యూ ప్రెస్ పై 14% చెల్లించేందుకు వీలుగా ఈ సవరణలు చెసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వ్యులు జారీ చేశారు.
మరోపక్క... తెలంగాణలోని బీరు ప్రియులకు సర్కార్ షాకిచ్చింది. నేటి నుంచి ధరలను 15 శాతం పెంచడానికి ఎక్సైజ్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వ్యులు జారీ చేశారు. ధరల స్థిరీకరణ కమిటీ సిఫార్సుల మేరకు బీరు ధరలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు!
దీని ప్రకారం... ఐ.ఎం.ఈ.ఎల్. డిపోల వద్ద ఉన్న నిల్వలు, రన్నింగ్ లో ఉన్నవి మంగళవారం నుంచి సవరించిన ధరలను విక్రయించబడతాయని వెల్లడించారు.