Begin typing your search above and press return to search.

నంద్యాల నుంచే నరుక్కు రావాలని ... !

నంద్యాల ఎందుకు హాట్ టాపిక్ అంటే సెప్టెంబర్ 9న ఎర్లీ మార్నింగ్ బాబు నంద్యాలలోనే ఏపీ సీఐడీ చేతిలో అరెస్ట్ అయ్యారు

By:  Tupaki Desk   |   2 Oct 2023 3:58 AM GMT
నంద్యాల నుంచే నరుక్కు రావాలని ... !
X

నంద్యాల టీడీపీకి హాట్ ఫేవరేట్ అవుతోంది. నిజానికి నంద్యాల 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో హోరా హోరీ పోరులో టీడీపీకి భారీ విజయాన్ని అందించి మరీ బూస్టింగ్ ఇచ్చింది. అలాంటి నంద్యాల మరోసారి ఇపుడు రాజకీయంగా చర్చకు వస్తోంది.

నంద్యాల ఎందుకు హాట్ టాపిక్ అంటే సెప్టెంబర్ 9న ఎర్లీ మార్నింగ్ బాబు నంద్యాలలోనే ఏపీ సీఐడీ చేతిలో అరెస్ట్ అయ్యారు. అలా ఇపుడు నంద్యాలను టీడీపీ తలచుకుంటోంది. రీసెంట్ గా టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నంద్యాలలోనే కీలక భేటీ జరిపింది.

బాబు అరెస్ట్ అయిన ప్రాంతం అంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అక్కడే రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఇపుడు అదే నంద్యాల టీడీపీ రాజకీయ జాతకాన్ని కీలక మలుపు తిప్పబోతోంది అని ఆ పార్టీ భావిస్తోంది.

చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం జోరుగా సాగుతోంది. నంద్యాలలో అయితే ఇపుడు టీడీపీకి సంబంధించి వర్గ పోరు ఒక లెవెల్ లో ఉంది. ఇంచ్జారిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇవ్వవద్దు తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికే టికెట్ దక్కాలని అఖిలప్రియ కోరుకుంటోంది. ఇంకో వైపు భూమా నాగిరెడ్డి అనుచరుడు సుబ్బారెడ్డి కూడా ఈ సీటు ఆశిస్తున్నారు.

అదే విధంగా చూస్తే సీనియర్ నేత మాజీ మంత్రి ఎస్ ఎండీ ఫరూఖ్ కూడా ఇదే సీటు మీద మోజు పెంచుకుంటున్నారు. ఇలా నంద్యాల సీటు అందరి మధ్యన పడి నలిగిపోతోంది. దాంతో ఈ సీటు మీద చంద్రబాబు గతంలోనే ఒక లుక్కు వేశారని అంటారు.

ఇపుడు ఎటూ సింపతీ కార్డు వర్కౌట్ కావడమే కాదు వైసీపీకి పెట్టని కోటలా ఉన్న టోటల్ కర్నూల్ రాజకీయాన్ని మలుపు తిప్పడానికి నంద్యాల నుంచి బాబు పోటీ చేయడం సో బెటర్ అని టీడీపీ భావిస్తోంది అని అంటున్నారు

మరి కుప్పం సంగతేంటి అంటే కుప్పంలోనూ బాబు పోటీ చేస్తూనే రెండవ సీటుగా నంద్యాలను ఎంచుకుంటారు అని అంటున్నారు. కేసీయార్ తెలంగాణా ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు రెండవ సీటు నుంచి పోటీ పడుతున్నట్లుగానే బాబు ఈ ప్రయోగం చేస్తారు అని అంటున్నారు.

అందుకే ఇపుడు టీడీపీలో నంద్యాల మీద హాట్ హాట్ డిస్కషన్ సాగుతోందిట. రాయలసీమలో వైసీపీని దెబ్బ కొట్టాలన్నా నంద్యాల నుంచే నరుక్కు రావాలని టీడీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఇక బాబు బెయిల్ మీద వస్తే ఆయన నంద్యాల నుంచే తాను ఆపేసిన జిల్లా టూర్ ని తిరిగి మొదలెడతారు అని అంటున్నారు. మొత్తానికి నంద్యాల టీడీపీ రాజకీయ జాతకాన్ని టర్న్ చేస్తుందా అంటే ఏమో చూడాల్సిందే అంటున్నారు.