Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఫ్లెక్సీలు చూసి తెలంగాణావాదులకు మండిందా ?

తెలంగాణాలో పసుపు జెండాల రెపరెపలు చంద్రబాబు భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఈ హడావుడి అంతా ఒక్క లెక్కన సాగుతోంది

By:  Tupaki Desk   |   6 July 2024 3:56 AM GMT
చంద్రబాబు ఫ్లెక్సీలు చూసి తెలంగాణావాదులకు మండిందా ?
X

తెలంగాణాలో పసుపు జెండాల రెపరెపలు చంద్రబాబు భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఈ హడావుడి అంతా ఒక్క లెక్కన సాగుతోంది. చంద్రబాబు ఏపీ సీఎంగా తాజాగా నాలుగవ సారి ఎన్నిక అయ్యారు. ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. అంతే కాదు ఉమ్మడి ఏపీని ఆయన తొమ్మిదేళ్ళ పాటు నాన్ స్టాప్ గా పాలించారు.

టీడీపీ తెలంగాణా శాఖ కూడా ఉంది. అలాంటపుడు బాబు ఫ్లెక్సీలు ఉండకూడదా అంటే అక్కడే చర్చ సాగుతోంది. తెలుగుదేశం రాజకీయ వైభోగం తెలంగాణాలో గతం అయింది. 2014 తరువాత ఆ పార్టీ అంతకంతకూ క్షీణించి పోతూ వచ్చింది. 2023లో ఎన్నికల్లో అయితే ఏకంగా పోటీకే దూరంగా ఉంటూ కఠిన నిర్ణయం తీసుకుంది.

అయితే ఏపీలో బాబు గెలవడంతో తెలంగాణా రాజకీయాల మీద ఆ ప్రభావం ఎంతో కొంత పడుతుందని అంటున్నారు. గతంలో తెలంగాణాలో సీఎం గా కేసీఆర్ ఉండేవారు. ఆయన టీడీపీని తెలంగాణాలో ఎదగకుండా అణచిపెట్టారు. అందులో గెలిచిన ఎమ్మెల్యేలను గుత్తమొత్తంగా కలిపేసుకున్నారు. టీడీపీకి ఉనికికే ముప్పు తెచారు.

ఆ తరువాత టీడీపీ మళ్లీ తన ప్రస్థానాన్ని కొనసాగించలని చూసినా సాధ్యపడలేదు. అయితే ఇపుడు తెలంగాణాలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఏలుబడిలో టీడీపీకి కొంత వెసులుబాటు లభిస్తోంది. దాంతోనే బాబు ఫ్లెక్సీలు బ్యానర్లూ అంటూ హడావుడి మళ్లీ మొదలైంది. అయితే ఇది అంతకంతకు ముదిరితే టీడీపీ పొలిటికల్ గా స్ట్రాంగ్ అయ్యే చాన్స్ ఎక్కడ ఉంటుందో అన్న చర్చ కూడా ఉంది.

ఇక చంద్రబాబు టీడీపీని పూర్తిగా అంధ్రా పార్టీగా భావిస్తూ వస్తున్న తెలంగాణావాదులు మాత్రం హైదరాబాద్ గడ్డ మీద బాబు ఫ్లెక్సీల హడావుడి ని చూసి మండిపోతున్నారు అని అంటున్నారు. బాబు రాజకీయం ఆయన చాణక్యం వంటి వాటి వల్ల ఆయనకు ఏ మాత్రం స్కోప్ ఇచ్చినా ఇబ్బందే అవుతుందని చాలామంది భావిస్తున్నారు.

మరో వైపు బాబు ఫ్లెక్సీలను పోలీసులు తీసి పక్కన పెట్టారు అన్న చర్చ కూడా సాగింది. ఇది కూడా టీడీపీకి దూకుడుకి బ్రేక్ వేయడానికేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా బాబు ఫ్లెక్సీలు అడుగడుగునా కనిపిస్తూ పసుపు పార్టీ సంబరాలను చూస్తున్న తెలంగాణావాదులు మాత్రం మండిపోతున్నారు అని అంటున్నారు. ఫ్లెక్సీల లొల్లి ఎంతదాకా వెళ్తుందో చూడాలి.

ఇక తెలంగాణా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఒకనాడు టీడీపీ లో ఉన్న వారు. బాబుకు అత్యంత సన్నిహితులు. ఆయన ఇపుడు రాజకీయంగా ఇలాంటివి అన్నీ చూస్తూ ముందుకు సాగాల్సి ఉందని సూచనలు వస్తున్నాయి. ఎటు నుంచి ఏమి జరిగినా అది రేవంత్ రెడ్డి కే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. అంతే కాదు ఈ పరిణామాలను ఎమోషనల్ గా మారితే బీఆర్ఎస్ అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది అని అంటున్న వారూ ఉన్నారు.