చంద్రబాబు అరెస్ట్... ఈటెల సస్పెన్షన్ : కేసీఆర్ జగన్ అందుకే ఓడిపోయారా ?
రాజకీయాల్లో తూకం రాళ్ళు ఉంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా కొలిచి పట్టుకోవాలి. అవసరం అయినప్పుడు వాటి బరువుని బట్టి వాడుకోవాలి
By: Tupaki Desk | 19 Jun 2024 2:45 AM GMTరాజకీయాల్లో తూకం రాళ్ళు ఉంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా కొలిచి పట్టుకోవాలి. అవసరం అయినప్పుడు వాటి బరువుని బట్టి వాడుకోవాలి. రాజకీయాల్లో ప్రతీ మాటకు విలువ ఉంది. అలాగే ప్రతీ చేతకూ ఒక లెక్క ఉంది. అధికారంలో ఉన్న వారికి మరీ ఎక్కువగా ఈ విలువలూ లెక్కలూ మారిపోతాయి. వారిని అంతా కోటి కళ్ళలో గమనిస్తూంటారు.
అయితే అధికారం అన్నది ఒక అద్భుతం. అది ఒక గమ్మత్తు లాంటి మత్తు. అందులో ఉన్న వారికి చాలా వరకూ ఏమీ కనిపించవు. పైగా తాము ఏమి చేసినా కరెక్ట్ అన్న భావన ఉంటుంది. అందుకే వారు తీసుకునే ప్రతీ నిర్ణయమూ జనాల మెప్పు పొందదు. అంతే కాదు వారు తీసుకునే నిర్ణయాలు కనుక సక్రమంగా లేకపోతే జనాగ్రహం పొందుతాయి.
అయితే జనాలు కొన్ని నిర్ణయాల పట్ల బాహాటంగా స్పందిస్తారు. మరికొన్ని టి పట్ల మౌనంగా ఉంటూనే సరైన సమయంలో రియాక్ట్ అవుతారు. ఆ విధంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కెసీఆర్ జగన్ ఆరు నెలల తేడాలో ఓటమి పాలు అయ్యారు.
వీరిద్దరి మధ్య కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. అవే ఇపుడు జనాలలో చర్చకు వస్తున్నాయి. అధికారంలో ఉన్నపుడు కొంతమందికి దూరం చేసుకుని కేసీఆర్ జగన్ పదవీచ్యుతులు అయ్యారు. అలాగే కొన్ని అవాంఛనీయ నిర్ణయాలు తీసుకుని వారు భారీ ఒటమితో బాధపడుతున్నారా అన్న చర్చకు తెర లేచింది.
ముందుగా కేసీఆర్ గురించి చెప్పుకుంటే మంచి నేత బీసీ వర్గానికి చెందిన నాయకుడు ఈటెల రాజెందర్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ విధంగా పార్టీతో రెండు దశాబ్దాల పాటుగా పెనవేసుకున్న బంధాన్ని విడగొట్టారు. ఈటెల పట్ల అందరికీ సానుభూతి ఏర్పడడానికి అది ఒక కారణం అయింది.
ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఈటెల గెలిచి చూపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు అయినా తాజాగా వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మల్కాజ్ గిరీ నుంచి గెలిచి ఎంపీ అయ్యారు. ఈటెల విజయం అలా ఉంటే ఆయన వల్ల బీఆర్ఎస్ కి ఎదురు దెబ్బలు తగిలాయి. పార్టీ కుటుంబానికే పరిమితం అయింది అన్న విమర్శలు వచ్చాయి,.
మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతను వెళ్ళగొట్టడం ప్రజా వ్యతిరేకతకు కారణం అయింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. దాంతో ఈటెల ఎపిసోడ్ చివరికి బీఆర్ఎస్ తలబొప్పి కట్టేలా చేసింది అని అంటున్నారు. బీఆర్ఎస్ ఓటమికి ఈటెల సస్పెన్షన్ ఒక ప్రధాన కారణం అని అంటున్నారు.
అదే విధంగా ఏపీ విషయానికి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబుని సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు అరెస్ట్ చేసి వైసీపీ కానీ జగన్ కానీ ఏమి సాధించారో అర్ధం కాదు. కానీ దాని వల్ల భారీ నష్టాన్ని మూటకట్టుకున్నారు అని అంటున్నారు. బాబు అరెస్ట్ తరువాతనే వైసీపీకి కష్టాలు మొదలయ్యాయి. అప్పటిదాకా ఉన్న వివిధ సెక్షన్లు అన్నీ పోలరైజ్ అయ్యాయి.
బాబు వంటి బిగ్ షాట్ కే భద్రత లేకపోఏ మన సంగతేంటి అన్న చర్చ కూడా వైసీపీ వ్యతిరేక శక్తులు ఒక చోటకు కూడడానికి కారణం అయింది. అంతే కదు ఏపీలో రాజకీయ శక్తుల పునరేకీకరణకు కొత్త పొత్తులు ఎత్తులకు కూడా బాబు అరెస్ట్ కేంద్ర బిందువు అయింది.
ఆ ఫలితాలను వైసీపీ తాజా ఎన్నికల్లో ప్రత్యక్షంగా అనుభవించింది. మొత్తం మీద చూస్తే కొన్ని హై లెవెల్ డెసిషన్స్ పీక్స్ కి చేరిన తరువాత తీసుకునే నిర్ణయాలు పూర్తి స్థాయిలో ఎలా బెడిసికొడతాయి అనడానికి ఈ రెండు ఎపిసోడ్స్ కళ్ళెదుట కనిపించే ఉదాహరణలు అని అంటున్నారు.