Begin typing your search above and press return to search.

సర్వే వాళ్ళకు పండగ టైం

ఇలా ఎవరికి వారు సర్వేలనే నమ్ముకోవడంతో తెలుగు రాజకీయాలలో సర్వేరాయుళ్ళకు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 11:04 AM GMT
సర్వే వాళ్ళకు పండగ టైం
X

సర్వేలు ఇపుడు తెలుగు రాష్ట్రాలలో సర్వ సాధారణం అయిపోయాయి. కోట్లాది మంది ప్రజల మనసులలో ఏమి ఉంది అన్నది తెలుసుకోవడానికి సర్వేలను నేతల దగ్గర నుంచి రాజకీయ పార్టీలు కూడా చేపడుతూ వస్తున్నాయి. సర్వేలతో ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అన్నది రాజకీయ పార్టీలు తమ కోణంలో తాము చేయించుకుంటూంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ పరిస్థితి ఎలా ఉంది అన్న దాని మీద సర్వేలు సొంతంగా చేయించుకుంటున్న నేపధ్యం ఉంది. అలాగే ఆశావహులు కూడా సర్వేల మీద పడడమే ఇపుడు కొత్త పాయింట్.

మొత్తం మీద చూస్తే ఏపీ రాజకీయాల్లో సర్వేరాయుళ్ల సందడి మామూలుగా లేదు. ఇక అధికార పార్టీ వైసీపీ తీసుకుంటే 2019 నుంచి పీకే టీం ని ఎంగేజ్ చేస్తూ వస్తోంది. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో మరోసారి పీకే టీం నే నమ్ముకుంది. ఆ టీం ఇచ్చే సర్వేల మీద అధికార పార్టీ పూర్తిగా ఆధార్పడుతోంది. అదే టైం లో మరో రెండు మూడు ఏజెన్సీల ద్వారా కూడా వైసీపీ అధినాయకత్వం సర్వేలు చేయిస్తూ ఆ దిశగా తమ పార్టీ పరిస్థితిని అలాగే అభ్యర్ధుల పరిస్థితిని కూడా ఎప్పటికపుడు అంచనా వేసుకుంటూ వస్తోంది.

ఇక తెలుగుదేశం పార్టీ కూడా సొంత సర్వేలతో పాటు తమకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా సర్వేలను ప్రతీ క్షణం చేయించుకుంటూ వస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీ సైతం ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకుంటూ వారిచ్చే సర్వేలను గ్రౌండ్ లెవెల్ లో రిపోర్టులను తీవ్రంగా పరిశీలన చేస్తూ అడుగు ముందుకు వేస్తోంది.

మూడవ పార్టీగా ఏపీలో ఉన్న జనసేన కూడా సర్వేలు చేయిస్తోంది అని అంటున్నారు. ఇటీవల ఆ పార్టీ తమకు ఏపీలో ఉన్న వివిధ రీజియన్లలో ఎక్కడ బలం ఉంది, ఎక్కడ తమ పార్టీ గ్రాఫ్ పెరిగింది అన్న దాని మీద సంపూర్ణనగ సర్వే చేయించుకుంది. దీంతో మూడు పార్టీలూ సర్వేలతో మునిగితేలుతున్నాయని చెప్పక తప్పదు.

ఇపుడు ఈ సర్వేలు పార్టీలను దాటి ఎమ్మెల్యేలు నాయకుల దాకా పాకుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కట్ అన్న వార్తలతో అప్రమత్తం అవుతున్న వారు అంతా సొంత సర్వేల మీద ఆధారపడుతున్నారు. తమ గురించి జనాలు ఏమి అనుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ఏంటి అన్న దాని మీద ఎమ్మెల్యేలు కీలక నేతలు కూడా ప్రైవేట్ సంస్థల ద్వారా సర్వేలను చేయించుకుంటున్న నేపధ్యం కనిపిస్తోంది.

మరో వైపు చూస్తే ఆశావహులు కూడా సర్వేలు చేయించుకుంటున్నారు. అదెలా అంటే వారికి టికెట్ కావాలి. ఎన్నికల్లో పోటీ అంటే కోట్ల రూపాయల వ్యవహారం అని ప్రచారంలో ఉన్న మాట. దాంతో నెగ్గుతామని ధీమా ఉంటేనే రంగంలోకి దిగాలని భావిస్తూ ముందు చూపుతో ఈ సర్వేలు చేయించుకుంటున్నారు అని అంటున్నారు. ఇలా ఎవరికి వారు సర్వేలనే నమ్ముకోవడంతో తెలుగు రాజకీయాలలో సర్వేరాయుళ్ళకు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు.

ఒక విధంగా చూస్తే వారికి పండుగే వచ్చింది అని అంటున్నారు. సర్వేలు చేసే వారు క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీగా మారిపోయారు అని అంటున్నారు చేతినిండా పనితో పాటు కాసుల వర్షం కురుస్తోంది అని అంటున్నారు. ఇక సర్వేలను గతంలో బడా సంస్థలు చేసేవి. ఇపుడు చిన్న పాటి నెట్ వర్క్ ఉంటే చాలు ప్రతీ చోటా సర్వేలు చేసే వారు ఎక్కువ అయిపోయారు కొంతమంది నియోజకవర్గాల స్థాయిలో సర్వేలను చేయిస్తూ ఆయా రాజకీయ పార్టీలను అభ్యర్ధులను ఆకట్టుకుంటున్నారు.

ఏ సర్వే నిజం అన్నది పక్కన పెడితే ప్రతీ వారు జనం వద్దకు వచ్చి కొన్ని ప్రశ్నలతో వారి మనోభావాలను వెలికితీయాలని చూస్తున్నారు. కానీ సర్వే రాయుళ్ళ అంచనాలకు జనాల నాడి అందుతోందా అన్నదే ఇక్కడ కీలకమైన పాయింట్. ఏ గూటి పక్షి ఆ గూటి పలుకు పలుక్తుంది అన్నట్లుగా సర్వేలు కూడా చిలక పలుకులు పలుకుతాయా లేక గ్రౌండ్ లెవెల్ వాస్తవాలను బయటపెడుతున్నాయా అన్నదే ఇక్కడ మ్యాటర్ గా ఉంది. ఏది ఏమైనా సర్వేరాయుళ్ళకు మాత్రం ఫుల్ బిజీ గా ఉంది.

అసలైన పండుగ అపుడే స్టార్ట్ అయిపోయింది అని అంటున్నారు. ఇపుడే ఇలా గిరాకీ ఉంటే ఎన్నికలు ఇంకా దగ్గర పడుతున్న కొద్దీ సర్వేలకు మరింత పని పడుతుందని, దాంతో ఈ ఫీల్డ్ ని నమ్ముకున్న వారికి బిజీ వర్క్ తో తో పాటు కరెన్సీ కూడా బాగానే దక్కుతోందని అంటున్నారు.