Begin typing your search above and press return to search.

తెలుగు విద్యార్థి చేసిన 'పాడు పని'కి 12 ఏళ్ల జైలుశిక్ష!

ఒక మైనర్‌ ను అక్రమ లైంగిక కార్యకలాపాలకు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినందుకు ఉపేంద్ర అదురు (32)కు జైలుశిక్ష పడింది.

By:  Tupaki Desk   |   26 July 2024 10:07 AM GMT
తెలుగు విద్యార్థి చేసిన పాడు పనికి 12 ఏళ్ల జైలుశిక్ష!
X

అమెరికాలో 32 ఏళ్ల తెలుగు విద్యార్థికి ఫెడరల్‌ కోర్టు 12 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఒక మైనర్‌ ను అక్రమ లైంగిక కార్యకలాపాలకు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినందుకు ఉపేంద్ర అదురు (32)కు జైలుశిక్ష పడింది.

32 ఏళ్ల ఉపేంద్ర అదురు అనే తెలుగు విద్యార్థి ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికాకు వెళ్లాడు. ఒక నెల పాటు అమెరికాలో ఉన్నాడు. ఈ క్రమంలో 13 ఏళ్ల అమెరికా బాలిక (వాస్తవానికి ఒక రహస్య డిటెక్టివ్‌) తో సోషల్‌ మీడియాలో పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాలికతో తన శృంగార ఆసక్తిని పదే పదే వ్యక్తం చేశాడు. అంతేకాకుండా బాలికకు నీలి చిత్రాలను సైతం పంపాడు.

ముందు తనను కలవాలంటూ బాలికను ఉపేంద్ర బలవంతం చేశాడు. ఎట్టకేలకు బాలిక ఒప్పుకుంది. ఈ క్రమంలో ఆ ఆమ్మాయిని మిల్‌ క్రీక్‌ టౌన్‌ షిప్‌ లోని పార్కులో కలిశాడు. అక్కడికి ఉపేంద్ర వచ్చాక పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ఈ క్రమంలో పోలీసులు ఉపేంద్ర ఫోన్‌ ను తనిఖీ చేయగా అందులో ఆ బాలికతో అతడు అసభ్యంగా చాట్‌ చేయడం, శృంగార కోరికను వ్యక్తం చేయడం, నీలిచిత్రాలు పంపడం కనిపించింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

తాజాగా ఈ కేసుకు సంబంధించి విచారణ పూరై్త తీర్పు వెలువడింది. నిందితుడు ఉపేంద్రకు 12 ఏళ్ల జైలుశిక్షను అమెరికా ఫెడరల్‌ కోర్టు విధించింది.

2006 అమెరికా.. ప్రాజెక్ట్‌ సేఫ్‌ చైల్డ్‌ హుడ్‌ తీసుకొచ్చింది. ఇది పిల్లల లైంగిక దోపిడీ, దుర్వినియోగాన్ని అరికడుతుంది. పిల్లలను లైంగికంగా దోపిడీ చేసే వ్యక్తులను గుర్తించడం, పట్టుకోవడం, విచారణ చేయడం, శిక్షలు విధించడం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. ఇందులో భాగంగా పోలీసులు.. సీక్రెట్‌ డిటెక్టివ్‌ లా సోషల్‌ మీడియాలో ఉంటారు. మైనర్‌ బాలికల పేరుతో కొనసాగుతారు. ఎవరైనా వీరిని సంప్రదించి లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపిస్తే పట్టుకుంటారు. ఇలా ప్రయత్నించి ఉపేంద్ర కూడా దొరికిపోయాడు.