Begin typing your search above and press return to search.

భయపెడుతున్న ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో..

గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

By:  Tupaki Desk   |   16 Dec 2024 10:27 AM GMT
భయపెడుతున్న ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో..
X

గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అందులోనూ..హైదరాబాద్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడూ చూడని విధంగా నగర ప్రజలు ఈసారి చలితో వణికిపోతున్నారు. కొన్ని చోట్ల 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వారంతా ఉన్ని దుస్తులను వీడని పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్‌కు పరిమితం అయ్యాయని వెల్లడించింది. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బీహెచ్ఈఎల్ పరిధిలో 7.4, రాజేంద్రనగర్ 8.2డిగ్రీలు, గచ్చిబౌలి 9.3 డిగ్రీలు, వెస్ట్ మారేడుపల్లిలో 9.9, కుత్బుల్లాపూర్‌లో 10.2 డిగ్రీలు, మచ్చబొల్లారంలో 10.2 డిగ్రీలు, శివరాంపల్లిలో 10.3 డిగ్రీలు, బాలానగర్‌లో 11.4 డిగ్రీలు, షాపూర్‌నగర్‌లో 11.7 డిగ్రీలు, లింగంపల్లిలో 11.8 డిగ్రీలు, బోయిన్‌పల్లిలో 11.9 డిగ్రీలు, బేగంపేట్‌లో 12 డిగ్రీలు, ఆసిఫ్‌నగర్‌లో 12 డిగ్రీలు, నేరేడ్‌మెట్‌లో 12.1డిగ్రీలు, లంగర్‌హౌస్‌లో 12.2డిగ్రీలు, మోండామార్కెట్ పరిధిలో 12.4డిగ్రీలు, చందానగర్‌లో 12.7డిగ్రీలు, షేక్‌పేటలో 12.8డిగ్రీలుచ మాదాపూర్‌లో 12.8 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే.. చాంద్రాయణగుట్ట పరిధిలో 13డిగ్రీలు, కూకట్‌పల్లిలో 13.1డిగ్రీలు, గోల్కొండలో 13.2డిగ్రీలు, సఫిల్‌గూడలో 13.3డిగ్రీలు, హయత్‌నగర్‌లో 13.3డిగ్రీలు, ఉప్పల్‌లో 13.4డిగ్రీలు, మల్లాపూర్‌లో 13.5డిగ్రీలు, ఆదర్శనగర్‌లో 13.5డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగానూ కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత చాలా వరకు ఉంది. రానున్న రోజుల్లో ఇక్కడ మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందులోనూ కొన్నిచోట్ల ఉదయం పూట పొగమంచు కురిసే అవకాశాలు సైతం ఉన్నట్లు వెల్లడించింది. చలి గాలులు వీస్తాయని తెలిపింది. రాబోయే కొద్ది రోజులపాటు పరిస్థితి ఇలానే ఉంటుందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఇక.. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా బేలలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6.3 డిగ్రీలుగా నమోదైంది. తిరుమలగిరిలో 13.6 డిగ్రీలు, చర్లపల్లిలో 13.6 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలోని తాండ్ర పరిధిలో 6.3 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెరలో 6.4 డిగ్రీలు, జైనథ్‌లో 6.5డిగ్రీలు, అర్లి (టి)లో 6.6డిగ్రీలు, చాప్రాల్ 6.6డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 6.6డిగ్రీలు, వికారాబాద్ జిల్లా బంట్వారంలో 6.7డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో 6.7డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో 6.7డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా చందనవల్లిలో 6.7డిగ్రీలు, సంగారెడ్డి పరిధిలోని కోహీర్‌లో 6.7డిగ్రీలు, వికారాబాద్ జిల్లాలోని మర్పల్లిలో 6.8డిగ్రీలు, నాగారం(టి)లో 6.8 డిగ్రీలు, మన్నెగూడలో 6.8 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 6.9 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 6.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే.. కామారెడ్డి జిల్లా మేనూరులో 6.9 డిగ్రీలు, జగిత్యాల జిల్లా రాఘవపేటలో 7.3 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 7.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.