టీడీపీలో ఒక వర్గం...ఏమి చేద్దాం...ఇదే చర్చ !
వారంతా టీడీపీ అంటే ప్రాణాలు ఇస్తారు. పార్టీ ఆత్మగా వారు ఉంటారు. తమ పార్టీ మీద ఈగ వాలనివ్వరు.
By: Tupaki Desk | 18 March 2025 6:00 PM ISTతెలుగుదేశం పార్టీలో ఇపుడు హాట్ హాట్ గా ఒక విషయం మీద చర్చ సాగుతోందిట. ఆ చర్చ అంతా కూడా పార్టీ పెద్దలకు ఇబ్బంది కలిగించేలా ఉందిట. నిజానికి తెలుగుదేశం పార్టీలో హార్డ్ కోర్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. వారంతా టీడీపీ అంటే ప్రాణాలు ఇస్తారు. పార్టీ ఆత్మగా వారు ఉంటారు. తమ పార్టీ మీద ఈగ వాలనివ్వరు.
అలాంటిది వారు ఇపుడు పార్టీ లో ఒక వర్గంగా ఉంటున్నారు. వారు పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల మేధో మధనం జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా వర్తమానంలో చోటు చేసుకుంటున్న అనేక పరిణామాల పట్ల కూడా వారు తమదైన శైలిలో స్పందిస్తున్నారని అంటున్నారు.
ఇలా తెలుగుదేశం పార్టీలో ఒక అతివాద వర్గం ఉందని తెలుస్తోంది. ఈ వర్గం అన్నది ప్రతీ పార్టీలో కూడా మామూలుగానే ఉంటుంది అన్నది నిజం. అయితే తెలుగుదేశంలో ఈ వర్గం దూకుడు వేరు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ అతివాద వర్గం తెలుగుదేశంలో రచ్చ చేస్తోంది అని అంటున్నారు. జనసేన మీద వీర లెవెల్ లో విరుచుకుపడుతోంది అని అంటున్నారు.
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ నాగబాబు మాట్లాడిన మాటలో పట్ల పూర్తి స్థాయిలో గుస్సా అవుతోంది అని అంటున్నారు. వీరు అన్న మాటలను సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు అని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీని నిలబెట్టామన్న పవన్ మాటల మీద గుర్రు అవుతోంది. టీడీపీని వారు నిలబెట్టేది ఏంది అని ఈ వర్గం ఒక్క లెక్కన ఫైర్ అవుతోంది. ఏపీలో ఒకవేళ ఈ పొత్తులు లేకపోయినా టీడీపీకి ఒంటరిగా 135 సీట్లకు తక్కువ కాకుండా వస్తాయని కూడా ఈ వర్గం ధీమాగా చెబుతోంది అంటున్నారు.
అంతే కాదు టీడీపీకి ఇప్పటివరకూ 40 శాతం ఓటు షేర్ తగ్గిన దాఖలాలు అయితే లేవు అని అంటున్నారు. టీడీపీ సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పార్టీ అని గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటామని కూడా అతివాదులు అంటున్నారు. గ్రామాలో చూస్తే టీడీపీ అత్యంత పటిష్టంగా ఉందని అదే జనసేనకు ఒక వర్గం అంటూ లేదని గుర్తు చేస్తున్నారు.
అలాగే సరైన నాయకత్వం కూడా వారికి లేదని అంటున్నారు. తూర్పు గోదావరిలో కొంచెం బలం ఉంది తప్పించి ఏమి ఉంది ఆ పార్టీకి అని జనసేన మీద టీడీపీ అతివాదులు విరుచుకుపడుతున్నారు. టీడీపీని నిలబెట్టేది పవన్ కళ్యాణ్ కాదని వారు చెబుతున్నారు.
ముందు ఆయనను ఆయన నిలబెట్టుకోమని ఈసారి ఎన్నికల్లో అని కూడా అంటున్నారు. తెలుగుఏశం పార్టీ వయసు నాలుగు దశబ్దాలు దాటింది. అటువంటి పార్టీని నిలబెట్టేది ఆయన ఎలా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీని ఎపుడూ నిలబెట్టేది క్యాడర్ అని అలాగే చంద్రబాబు ఫేస్ వాల్యూ అని ఈ రెండే ప్రజలలో నమ్మకాన్ని పెంచి టీడీపీకి అధికారాన్ని తెచ్చాయని వారు గుర్తు చేస్తున్నారు.
మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ నాగబాబు అన్న మాటలను టీడీపీలోని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే అసలు తట్టుకోలేకపోతున్నారు. వారు సోషల్ మీడియా వేదికగా తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఒక విధంగా ఈ తరహా వ్యాఖ్యలను టీడీపీలో అతివాదులు అవమానంగా ఫీల్ అవుతున్నారు. తెలుగుదేశం ఎన్నో రికార్డులు సృష్టించిన పార్టీగా వారు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎదురులేకుండా తెలుగు రాజకీయాల్లో తన జెండాని ఎగుర వేస్తోందని అంటున్నారు. అలాంటి పార్టీ విషయంలో ఎవరు ఏ విధంగా మాట్లాడినా అతివాదులకు కోపమే వస్తుందని చెబుతున్నారు. అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం జనసేనకు ఆ పార్టీ పెద్దలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూండడాన్ని చూసి ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ క్యాడర్ మనోభావాలు దెబ్బతిన్నాయన్నది వారి మాటగా ఆవేదనగా ఉంది. చూడాలి మరి టీడీపీలో ఈ అతివాదం ఏ రూపం తీసుకుంటుందో. ఎంతదూరం వెళ్తుందో.