అమెరికాలో ఘోర ప్రమాదం... తుడిచిపెట్టుకుపోయిన భారతీయ కుటుంబం!
అవును... అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు భారత సంతతి వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
By: Tupaki Desk | 18 Aug 2024 6:07 AM GMTవిదేశాల్లో.. ప్రధానంగా అమెరికాలో జరుగుతున్న పలు ప్రమాదాల్లో బలైపోతున్న భారతీయులు, భారతీయ సంతతి వ్యక్తుల జాబితాలో ఈసారి ఏకంగా ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు చేరిపోవడం తీవ్ర విషాదంగా మారింది. టెక్సాస్ యూనివర్శిటీలో తమ కుమార్తెను జాయిన్ చేయడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది.
అవును... అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు భారత సంతతి వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారు టెక్సాస్ యూనివర్శిటీకి వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు టైరు ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలోని లియాండర్ లో నివాసం ఉంటున్న అరవింద్ మణి (45), అతని భార్య ప్రదీపా అరవింద్ (40), వారి కుమార్తె ఆండ్రిల్ అరవింద్ (17) లూపాస్ కౌంటీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది.
అరవింద్, తని భార్య.. తమ కుమార్తెను ఉత్తర టెక్సాస్ లోని కాలేజీకి తీసుకువెళ్తున్నారు. 17 ఏళ్ల తమ కుమార్తె హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ కి వెళ్లింది. ఈ సమయంలో ఆమె యూనివర్శిటీకి హాజరుకాబోతోంది. ఆమె కంప్యూటర్ సైన్స్ చదవాలని అనుకుందని అంటున్నారు. ఈ సమయంలో వీరు కారులో బయలుదేరారు.
ఈ సమయంలో... ఉన్న పలంగా వీరు ప్రయాణిస్తున్న కారు వెనుక టైరు ఊడిపోయిందంట. దీంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో ఈ భారతీయ సంతతి కుటుంబం ప్రయాణిస్తున్న కారు గంటకు 112 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంటే... ఎదురుగా వస్తున కారు 160 కి.మీ వేగంతో ఉందని చెబుతున్నారు.
దీంతో... ఇవతలి వైపు కారులో ఉన్న ముగ్గురు భారతీయ సంతతి కుటుంబ సభ్యులతో పాటూ ఎదురుగా వస్తున్న కారులో ప్రయాణిస్తున్న జాసింటో గుడినో డ్యూరాన్ (31), అతనితో పాటు ప్రయాణిస్తున్న మరో మహిళా ప్రయాణికురాలు (23) ఇద్దరు మృతి చెందారని అంటున్నారు.
కాగా.. అరవింద్ మణి - ప్రదీప దంపతులకు కుమార్తెతో పాటు మరో 14 ఏళ్ల కుమారుడు ఆదిర్యాన్ ఉన్నాడు. అయితే... కుటుంబంలోని ముగ్గురూ ఒకేసారి చనిపోవడంతో ఇప్పుడు అతడు ఒంటరిగా మిగిలిపోవడం అందరినీ కలిచివేస్తోంది. మరోపక్క ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చనిపోవడంపట్ల అక్కడి ప్రవాస భారతీయులూ విచారం వ్యక్తం చేస్తున్నారు.