పాక్ ప్రభుత్వంలో తీవ్రవాది భార్యకు చోటు... ఇష్యూ వైరల్!
ఇందులో భాగంగా... పాకిస్తాన్ తాతకాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అన్వర్-ఉల్-హాక్ కకర్ తాత్కాలిక కేబినెట్లో తీవ్రవాది యాసిన్ మాలిక్ సతీమణి మిశాల్ హుస్సేన్ మాలిక్ కు కూడా చోటు దక్కింది.
By: Tupaki Desk | 18 Aug 2023 1:30 AM GMTతీవ్రవాదులకు పాకిస్థాన్ లో స్థిర నివాసాలు ఉంటాయని.. ప్రభుత్వమే వారికి తగిన సదుపాయాలు కల్పిస్తుందని.. తీవ్రవాదులు అంటే పాక్ అనధికారిక సైన్యం వంటి వారని రకరకాల కథనాలు వినిపిస్తుంటాయి. ఈ సమయంలో వాటిని బలపరిచే అంశమో.. స్థిరపరిచే అంశమో తెలియదు కానీ... ఒక కీలక అంశం తెరపైకి వచ్చింది.
అవును... పాకిస్థాన్ లో తీవ్రవాదులకు ఉన్న స్థానాన్ని మరోసారి చర్చల్లోకి తీసుకొచ్చే సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... పాకిస్తాన్ తాతకాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అన్వర్-ఉల్-హాక్ కకర్ తాత్కాలిక కేబినెట్లో తీవ్రవాది యాసిన్ మాలిక్ సతీమణి మిశాల్ హుస్సేన్ మాలిక్ కు కూడా చోటు దక్కింది.
ప్రస్తుతం పాకిస్తాన్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. తాత్కాలిక కేబినెట్ అయినా, శాస్వత కేబినేట్ అయినా.. తీవ్రవాది భార్యకు ఏకంగా కేంద్రమంత్రిగా బాధ్యతలు ఇవ్వడం తీవ్రంగా చర్చనీయాంశం అయ్యింది.
కాగా... త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో షెబాజ్ షరీఫ్ తమ ప్రభుత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంఓతో ఆగస్టు 15న అన్వర్-ఉల్-హాక్ కకర్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన నియమించిన కొత్త కేబినెట్ మంత్రుల జాబితాలో మంత్రిగా మిశాల్ హుస్సేన్ మాలిక్ ను నియమించినట్లు తెలిపారు.
ఇలా ప్రస్తుతం మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మిశాల్ హుస్సేన్ మాలిక్ భర్త... యాసిన్ మాలిక్ జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత. తీవ్రవాదులకు నిధులను సమకూర్చిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నె నేరస్తుడిగా నిర్ధారించగా.. కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. ప్రస్తుతం యాసిన్ మాలిక్ శిక్షను అనుభవిస్తున్నాడు.
మరోపక్క ఆయన భార్య ఈ నెల 16న కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది. ఈమెతోపాటు మొత్తం 16 మంది మంత్రులతో కూడిన పాకిస్తాన్ కేబినెట్ తో అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ప్రమాణ స్వీకారం చేయించారు.
కాగా... పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ మఫ్టీ సోదరి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మఫ్టీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబైయా సయీద్.. 1989 - డిసెంబరు 8న కిడ్నాప్ కు గురయ్యారు. ఆ కేసులో యాసిన్ మాలిక్ ను నిందితుడిగా గుర్తించారు. దీంతో యాసిన్ మాలిక్ స్థాపించిన జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ను 2019లో పాకిస్తాన్ అధికారికంగా నిషేధించింది!