Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో... రోబోకి కూడా అర్ధమైపోయిందా 'మనిషి' గురించి..?

ఇవి ప్రపంచానికి అతిపెద్ద సర్ ప్రైజ్ లు గా చాలా మంది భావించారు.

By:  Tupaki Desk   |   13 Oct 2024 2:45 AM GMT
వైరల్  వీడియో... రోబోకి కూడా అర్ధమైపోయిందా మనిషి గురించి..?
X

ప్రపంచానికి సాంకేతిక రంగంలో తనదైన సర్ ప్రైజ్ లు ఇవ్వడంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ముందుంటారనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో "వి రోబో" కార్యక్రమంలో రోబో వ్యాన్, సైబర్ ట్యాక్సీ మోడల్స్ ను ఆవిష్కరించి షాకిచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి ప్రపంచానికి అతిపెద్ద సర్ ప్రైజ్ లు గా చాలా మంది భావించారు. నెట్టింట వీటికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో టెస్లా రూపొందించిన ఆప్టిమస్ రోబోను తాజాగ ఎలాన్ మస్క్ ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆ ఆప్టిమస్ రోబో.. ఒక గెస్ట్ మధ్య జరిగిన సంభాషణ ఆకట్టుకుంటోంది.

అవును... వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో జరిగిన "వీ రోబో" కార్యక్రమంలో దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఓ వ్యక్తి అడిగిన ఓ ప్రశ్నకు రోబో ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. దానికి సంబంధించిన గెస్ట్ ఈ వీడియోను పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఆ సంస్థకు చెందిన హ్యూమనాయిడ్ రోబో "ఆప్టిమస్" అందరి దృష్టినీ ఆకర్షించింది. అన్ని పనులూ చకచకా చేసింది. ఇందులో భాగంగా... అతిథులందరితో కబుర్లు చెబుతూ.. వారితో కలిసి డ్యాన్స్ చేస్తూ.. వారితో సెల్ఫీలు దిగుతూ.. డ్రింక్స్ సర్వ్ చేస్తూ సందడి చేసింది. ఈ క్రమంలో ఓ గెస్ట్ కు ఈ రోబోకు మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా రోబోని ప్రశ్నించిన ఓ గెస్ట్... "రోబోగా ఉండటంలో కష్టమైన పని ఏమిటి?" అని అడగాడు. దీనికి స్పందించిన రోబో... "మనుషుల్లా ఉండటం ఎలాగో నేర్చుకోవడమే నాకు అత్యంత కష్టమైన పని" అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో... దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరోపక్క ఈ ఈవెంట్ లో రోబో ప్రదర్శన అనంతర మాట్లాడిన ఎలాన్ మస్క్... దాని పెర్ఫార్మెన్స్ పై స్పందించారు. ఇందులో భాగంగా... ఈ రోబో మీకు కావాల్సిన అన్ని పనులూ చేస్తుందని.. కిచెన్ శుభ్రం చేస్తుందని.. పిల్లలను కూర్చోబెడుతుందని.. గడ్డి కోస్తుందని.. శునకాలను వాకింగ్ కి తీసుకెళ్తుందని తెలిపారు!