ఎలాన్ మస్క్ కంపెనీకి 'ఆమె' గుడ్ బై!
కాగా ఈ ఏడాది ఏప్రిల్ లో ముగ్గురు ఎగ్జిక్యూటివ్ లు టెస్లాలో తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న శ్రీలా వెంకటరత్నం కూడా తప్పుకున్నారు.
By: Tupaki Desk | 24 Aug 2024 9:32 AM GMTస్పేస్ ఎక్స్, టెస్లా, న్యూరాలింక్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ కు భారత్ సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం షాక్ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆమె టెస్లా కంపెనీలో కీలక హోదాల్లో పనిచేశారు. 11 ఏళ్ల తర్వాత తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత జీవితాన్ని గడపడం కోసమే తాను టెస్లా నుంచి తప్పుకున్నట్టు శ్రీలా వెంకటరత్నం వెల్లడించారు. కుటుంబం, స్నేహితులతో సమయం గడపడానికే తాను ఉద్యోగం నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు లింక్డిన్ లో ఒక పోస్టు చేశారు.
2013లో టెస్లాలో చేరిన శ్రీలా వెంకటరత్నం గత 11 ఏళ్లలో ఎన్నో హోదాల్లో ఉన్నారు. ఆర్థిక కార్యకలాపాల డైరెక్టర్ గా టెస్లాలో చేరిన ఆమె ఆ తర్వాత సీనియర్ డైరెక్టర్ హోదాకు చేరుకున్నారు. 2019లో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆ పదవిలోనే శ్రీలా వెంకటరత్నం ఉన్నారు. ఈ క్రమంలో ఐదేళ్ల విరామం తర్వాత టెస్లాకు రాజీనామా చేశారు.
కాగా తాను కంపెనీలో చేరిన తర్వాతే టెస్లా 700 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించిందని శ్రీలా వెంకటరత్నం తెలిపారు. ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం అన్నారు. కొంతకాలం పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపాక కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తానని చెప్పారు,
తన ఉద్యోగ జీవితంలో ఎన్నో విజయాలు సాధించానని శ్రీలా వెంకటరత్నం తెలిపారు. ఇందుకు తన తోటి ఉద్యోగులు ఎంతో సహకారం అందించారని చెప్పారు. అయితే టెస్లాలో పనిచేయడం కష్టమని ఆమె పేర్కొన్నారు.
కాగా ఈ ఏడాది ఏప్రిల్ లో ముగ్గురు ఎగ్జిక్యూటివ్ లు టెస్లాలో తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న శ్రీలా వెంకటరత్నం కూడా తప్పుకున్నారు.
కాగా తన రాజీనామా లేఖను లింక్డిన్ లో శ్రీలా వెంకటరత్నం పోస్టు చేశారు. దీనికి ఆ కంపెనీ మాజీ సీఎఫ్‌వో ఒకరు రిప్లై ఇచ్చారు. రాజీనామా చేసి మంచిపని చేశారని ఆమెను అభినందించారు. దానికి శ్రీలా కూడా రిప్లై ఇచ్చారు. టెస్లాలో పనిచేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. అందుకు ఆయన మరో రిప్లై ఇస్తూ నిజం అంటూ కామెంట్ చేశారు. దీన్నిబట్టి పనిఒత్తిడితోనే శ్రీలా వెంకరత్నం టెస్లా తప్పుMýని ఉంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.