"అంబేద్కర్ సిగ్గుతో తలదించుకునేవారు"... దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు!
ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చిన హీరో దళపతి విజయ్.. తన వ్యాఖ్యలు, ప్రసంగాలతో అందరి దృష్టినీ ఆకర్షింస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Dec 2024 11:30 AM GMTభారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వాలు చేసే సహాయకచర్యలపై డీఎంకే ప్రభుత్వాన్ని ఇటీవల తూర్పారబట్టిన టీవీకే అధినేత దళపతి విజయ్... రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 58వ జయంతి సందర్భంగా జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపైనా, ఇటు రాష్ట్రంలోని డీఎంకే సర్కార్ పైనా నిప్పులు చెరిగారు.
అవును... ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చిన హీరో దళపతి విజయ్.. తన వ్యాఖ్యలు, ప్రసంగాలతో అందరి దృష్టినీ ఆకర్షింస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చెన్నైలో నందంబాక్కం ట్రేడ్ సెంటర్ లో ఓ కార్యక్రమం జరిగింది.
"అంబేద్కర్ అందరికీ నాయకుడు" అనే ఈ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన... కేంద్రంలోని బీజేపీ, తమిళనాడులోని డీఎంకే సర్కార్ లపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా... మణిపూర్ లో జరుగుతున్న హింసను ఎత్తి చూపిన విజయ్... కేంద్రం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
అసలు మణిపూర్ లో ఏమి జరుగుతుందో తనకే తెలుసని.. కానీ అవేవీ పట్టించుకోకుండా దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఎన్డీయే అని ఎద్దేవా చేశారు. ఇదే క్రమంలో... తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించేందుకు.. దళితుల కోసం ఉద్దేశించిన వాటర్ ట్యాంక్ లో మానవ మలమూత్రాలను కలిపిన ఘటనను ఎత్తి చూపారు.
ఈ నేపథ్యంలోనే... ఇదంతా చూసి అంబేద్కర్ సిగ్గుతో తల దించుకుని ఉండేవారని అన్నారు. ఇదే సమయంలో... ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలని.. ఆ బాధ్యత ప్రజలే తీసుకోవాలని విజయ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛయుతమైన, నిషక్షపాతమైన ఎన్నికలు కీలకమని నొక్కి చెప్పారు.