విజయ్ పొలిటికల్ గేమ్ మొదలైందా?
అయితే విజయ్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతాడా? పొత్తులతో ముందుకెళ్తాడా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు
By: Tupaki Desk | 22 Aug 2024 3:30 PM GMTతలపతి విజయ్ 2026 ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉండటంతో పార్టీ కార్యకలపాల్లో బిజీ అయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని గంటల క్రితమే పార్టీ జెండాను, గీతాన్ని కూడా విష్కరించారు. దీంతో ఇకపై పార్టీ పనుల్లో విజయ్ మరింత చురుకుగా పని చేస్తారని స్ఫష్టమవుతుంది.
అయితే విజయ్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతాడా? పొత్తులతో ముందుకెళ్తాడా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఊహాగానాల ప్రకారం విజయ్ దివంగత సీఎం వైఎస్ రాజేశేఖర్ రెడ్డి తరహాలో తమిళనాడు అంతటా పాద యాత్ర చేస్తారనే ప్రచారం సాగుతుంది. కానీ దీనిపై క్లారిటీ లేదు. పార్టీ జెండా ఆవిష్క రించిన నేపథ్యంలో ఒకపై ఒక్కో అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.
ఇటీవలే ఓ సమావేశంలో డీఎంకే పై విజయ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిదే. సరిగ్గా ఇదే సమయంలో విజయ్ కి అధికార పార్టీ నుంచి కొన్ని కలిసొచ్చే అంశాలు కనిపిస్తున్నాయి. రాబోవు శాసనసభ ఎన్నికల ల్లోనూ మరోమారు విజయం సాధించే దిశగా డీఎంకే భారీగా మార్పులు చేస్తోంది. పార్టీలోని వివిధ విభాగాలకు నూతన జవసత్వాలు కల్పించేందుకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ సహా సీనియర్ నేతలు చర్యలు చేపడుతున్నారు.
117 జిల్లాల్లో కార్యదర్శుల్ని నియమించేందుకు అదిష్టానం వ్యూహరచన చేస్తోంది. సరిగ్గా ఇదే సమయం లో విజయ్ కూడా ఆ పార్టీ శ్రేణులతో టచ్ లోకి వెళ్తున్నారుట. పార్టీలో అసంతృప్తి పరుల్ని, కార్యదర్శ పదవి రాని వారిని తమ పార్టీలో చేర్చుకునే దిశగా ప్రణాళిక వేస్తున్నారుట. ఇప్పటికే డీఎంకే పై అసంతృ ప్తితో ఉన్న నాయకులు విజయ్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది.