Begin typing your search above and press return to search.

అదండీ బాబు రాజకీయ వ్యూహం...!

మరి వైసీపీ ప్లాన్ ఇలా ఉంటే దీని నుంచి పొలిటికల్ అడ్వాంటేజ్ ని పొందడానికి చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 4:00 AM GMT
అదండీ బాబు రాజకీయ వ్యూహం...!
X

జగన్ మూడు నెలల ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేసి జనంలోకి పంపించాలని చూస్తున్నారు. జస్ట్ శాంపిల్ గా పదకొండు మంది ఇంచార్జిలను ప్రకటించారు. సెకండ్ లిస్ట్ కూడా తొందరలో ఉండవచ్చు అంటున్నారు. మొత్తం జాబితా జనవరి నెలాఖరులోగా రానుంది అని అంటున్నారు.

అంటే ఎన్నికలు ఏపీలో మార్చి నెలాఖరులో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ జరిగిన పక్షంలో అభ్యర్ధులకు కచ్చితంగా రెండు నెలలకు పైగా సమయం ఉంటుందని వారు ప్రచారం చేసుకుని జనాల్లోకి వెళ్లగలరన్నది జగన్ ప్లాన్.

మరి వైసీపీ ప్లాన్ ఇలా ఉంటే దీని నుంచి పొలిటికల్ అడ్వాంటేజ్ ని పొందడానికి చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు. అదేలా అంటే జగన్ అభ్యర్థుల లిస్ట్ మొత్తం బయటకు వచ్చాక వారి బలాబలాలు చూసి తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపు గుర్రాలని ఎంపిక చేయాలని బాబు మాస్టర్ ప్లాన్ తో ఉన్నారని అంటున్నారు.

ఒకసారి వైసీపీ జాబితా బయటకు వస్తే అభ్యర్ధుల సామాజిక నేపధ్యం అంగబలం అర్ధం బలం, ఇతరత్రా అంశాలు అన్నీ కూడా చూసుకుని ధీటైన అభ్యర్ధులను పోటీకి పెట్టాలన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు. ఈసారి ఎన్నికలు టీడీపీ వరకూ చూస్తే చాలా కీలకం. ఒక విధంగా చెప్పాలీ అంటే చావో రేవో అని కూడా అంటున్నారు.

దాంతో ఏ ఒక్క తప్పూ చేయకూడదు అన్నది బాబు ఆలోచన. అదే టైంలో ప్రయోగాలు కూడా చేసి చేయి కాల్చుకోరాదని కూడా భావిస్తున్నారు. గతంలో అయితే ఏడాది ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తామని టీడీపీ చెప్పినా చంద్రబాబు మాత్రం ఇపుడు ఆ చాన్స్ తీసుకోదలచుకోలేదని అంటున్నారు.

తాపీగానే అన్నీ చూసుకుని మరీ అభ్యర్ధులను ఎంపిక చేయాలని అనుకుంటున్నారుట. ఒక విధంగా చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకూ ఉన్న గోల్డెన్ పీరియడ్ ని పూర్తిగా వాడుకోవాలని బాబు చూస్తున్నారు అని అంటున్నారు.

బాబు ఆలోచనలకు జగన్ కొత్త ప్రయోగాలు ఏ మేరకు ఉపయోగపడనున్నాయని చర్చకు వస్తోంది. వైసీపీ అభ్యర్ధుల లిస్ట్ చూస్తే టీడీపీకి పూర్తి క్లారిటీ వస్తుందని దాంతో తమ వైపు నుంచి కూడా గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవడం సులువు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారుట.

ఈ లోగా పొత్తుల విషయాలను చక్కబెట్టుకుంటే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లుగా వైసీపీ లిస్ట్ బయటకు వస్తుందని అంటున్నారు. సో చంద్రబాబు స్ట్రాటజీ కరెక్టా లేక జగన్ ముందస్తుగా అభ్యర్ధులను ప్రకటించడం కరెక్టా అన్నది ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయని అంటున్నారు.