అదృష్టం అంటే ఇదేనేమో.. ఏకంగా రూ.1,800 కోట్ల జాక్‌పాట్
లక్కీ లాటరీలో జాక్‌పాట్ తగిలి ఏకంగా రూ.1,800ను గెలుచుకున్నాడు.
By: Tupaki Desk | 27 Nov 2024 7:30 PM GMTఅదృష్టం అంటే అతనిదేనేమో. అదృష్ట లక్ష్మీ ఎప్పుడు ఎవరినీ ఏ విధంగా వరిస్తుందో ఊహించలేం. అప్పటివరకు కష్టాలు అనుభవించిన వారు ఒక్కసారిగా కోటీశ్వరులు అయిన దాఖలాలు ఉన్నాయి. సరిగా.. యూకేలోని ఓ వ్యక్తికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. లక్కీ లాటరీలో జాక్‌పాట్ తగిలి ఏకంగా రూ.1,800ను గెలుచుకున్నాడు.
చాలా రాష్ట్రాల్లో లాటరీ టికెట్ల అమ్మకాలను చూస్తుంటాం. ముఖ్యంగా మన దేశంలోని కేరళ, తదితర రాష్ట్రాల్లో ఈ లాటరీ టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. చాలా వరకు లాటరీ టికెట్లు గెలుచుకొని రాత్రికిరాత్రి లక్షాధికారులు అయ్యారు. లాటరీ టికెట్ ద్వారా వచ్చిన డబ్బులతో తమ దరిద్రాన్ని ఒక్కసారిగా పక్కన తోసేశారు. యూకేలో కూడా ఓ వ్యక్తికి ఇంతటి జాక్‌పాట్ తగులుతుందని ఆయన కూడా ఊహించలేకపోయాడు.
బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి నేషనల్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. టికెట్ కొనుగోలు చేసిన వందలాది మందిలో ఆయన కూడా ఒకరు. అతనికి ఏకంగా 177 మిలియన్ పౌండ్లు (అంటే భారతీయ కరెన్సీలో సుమారు 1800 కోట్ల)ను గెలుచుకున్నాడు. అయితే.. యూకేలోని అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ ఇదే అని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.
లాటరీ నిర్వాహకులు ఎట్టకేలకు డ్రా తీశారు. 01,11,25,31,40 నంర్ టికెట్‌కు జాక్‌పాట్ తగిలినట్లు ప్రకటించారు. అయితే.. ఈ లాటరీ టికెట్‌ని ఒక వ్యక్తి మాత్రమే తీసుకున్నట్లయితే ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్టులో ఉన్న సంగీత కళాకారులు హ్యారీ స్టైల్స్, అడెలె కంటే ధనవంతుడిగా నిలుస్తాడని అక్కడి ఓ సీనియర్ ఆఫీసర్ తెలిపరు. మరోవైపు విజేతకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు. 2022 మే 10న వచ్చిన ఓ లాటరీ ప్రైజ్‌మనీ ఇప్పటివరకు యూకేలోని అతిపెద్ద జాక్‌పాట్‌గా చరిత్రలో నిలిచింది. ఆ తర్వత ఏడాది జూలై 19న నేషనల్ లాటరీలో గ్లౌసెస్టర్‌కు చెందిన జో, జెస్ త్వైట్‌లు 195 మిలియన్ పౌండ్లు గెలుచుకొని మొదటి రికార్డును బద్దలుకొట్టారు. తాజాగా.. 800 కోట్లతో ఆ రికార్డు కూడా బద్దలయింది.